కరోనాతో తెల్లని పులి పిల్లలు మృతి?, మండిపడుతున్న జంతు ప్రేమికులు

కరోనాతో తెల్లని పులి పిల్లలు మృతి?, మండిపడుతున్న జంతు ప్రేమికులు

Lahore zoo : కరోనా జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కుక్కలు, పిల్లులు, పులులు, ఇతర జంతువులు మృత్యుబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా..రెండు తెల్లని పులి కూనలు మరణించడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. పాకిస్థాన్ లోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహోర్ నగరంలోని జూలో 11 వారాల వయస్సున్న రెండు తెల్ల పులి పిల్లలు ఉన్నాయి. ఇవి జనవరి నెలలో అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో జంతువుల వైద్యులు చికిత్స అందించారు. జనవరి 30వ తేదీన అవి చనిపోయాయి.

పులి పిల్లల్లో ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని, కరోనా వైరస్ వల్ల మరణించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు వైద్యులు. జూలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారించారు. పులి కూనలను చూసే..వ్యక్తి నుంచి వాటికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు…జంతువుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించడంపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అరుదైన తెల్ల పులి కూనల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, దీంతో అవి చనిపోయాయని అంటున్నారు. తెల్లపులులు చాలా అరుదుగా ఉంటాయని, మంచి ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన వాతావరణం అవసరమని Zufishan Anushay, founder of JFK (Justice for Kiki) Animal Rescue And Shelter వెల్లడించారు. పెషావర్ జంతు ప్రదర్శనశాలలో 2020లో నాలుగు జిరాఫీలు మరణించాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే..పాకిస్థాన్ లో కరోనా వైరస్ సోకి..12 వేల 256 మంది మృతి చెందారు.