Girl Kills Snake With Teeth : OMG.. పాముపై ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల చిన్నారి.. కాటేసిన పామును కొరికి కొరికి చంపేసింది

టర్కీలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల పాప చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో తెలుసా.. తనను కాటేసిన పాముపై ప్రతీకారం తీర్చుకుంది. తనను కాటేసిన పాముని కసిదీరా కొరికి కొరికి చంపేసింది.

Girl Kills Snake With Teeth : OMG.. పాముపై ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల చిన్నారి.. కాటేసిన పామును కొరికి కొరికి చంపేసింది

Girl Kills Snake With Teeth : టర్కీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల పాప చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంతకీ ఆ పాప ఏం చేసిందో తెలుసా.. తనను కాటేసిన పాముపై ప్రతీకారం తీర్చుకుంది. తనను కాటేసిన పాముని కసిదీరా కొరికి కొరికి చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం.

ఈ ఘటన టర్కీలో జరిగింది. బింగోర్ నగరంలో ఓ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడెన్ గా పాము వచ్చింది. అది దాదాపు అరమీటర్ పొడవు ఉంటుంది. పాము.. బాలిక కింద పెదవిపై కరిచింది. అంతే.. పాము కరవడంతో చిన్నారి కోపంతో ఊగిపోయింది. నన్నే కాటేస్తావా అంటూ ఆ సర్పాన్ని చేతికి తీసుకుంది. తన నోట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కసిదీరా కొరికేసింది. దీంతో పాము చచ్చిపోయింది.

ఆ తర్వాత పాప గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టింది. పాప అరుపు విన్న తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చారు. అక్కడి సీన్ చూసి వారు నిర్ధాంతపోయారు. బాలిక నోటికి రక్తపు మరకలు ఉండడం.. అక్కడే ఓ పాము చనిపోయి ఉండడం.. దానిపై పంటి గాట్లు ఉండడంతో.. తల్లి దండ్రులు కంగారుపడ్డారు. తమ కూతురు పాముని కొరికి చంపిందిని అర్ధమైంది. అదే సమయంలో పాప పెదవిపై పాము కాటేసిన ఆనవాళ్లు ఉండడంతో భయపడిపోయారు. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పాపను పరీక్షించిన డాక్టర్లు.. ఆ పాప పెదవిపై పాము కాటువేసినట్లు నిర్ధారించారు. సకాలంలో పాము కాటుకు విరుగుడు మందును ఇచ్చారు. అనంతరం చిన్నారిని 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇప్పుడు పాప క్రమంగా కోలుకుంది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. దేవుడి దయ వల్లే తమ పాప బతికిందని సంతోషపడ్డారు.

తనను కాటేసిన పాముని రెండేళ్ల చిన్నారి కొరికి చంపేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ బాలిక గురించే అంతా చర్చించుకుంటున్నారు. సరిగా మాటలు కూడా రాని పాప, ఆడుకోవడం తప్ప మరేమీ తెలియని చిన్నారి.. ఇంత పని చేసిందని తెలిసి అంతా విస్తుపోతున్నారు.