J&J Vaccine One Shot : జే&జే సింగిల్‌ డోసు టీకాకు బ్రిటన్‌ ఆమోదం

ప్రముఖ టీకా తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చింది.

J&J Vaccine One Shot : జే&జే సింగిల్‌ డోసు టీకాకు బ్రిటన్‌ ఆమోదం

J&j Vaccine

One-Shot J&J Vaccine : ప్రముఖ టీకా తయారీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోసు టీకాకు బ్రిటన్ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చినట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్లో నాలుగు వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. సింగిల్ డోసు టీకా మాత్రం ఇదే మొదటిది కావడం విశేషం.

కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ ముందు ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రాజెనెకాను వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. అమెరికా మోడెర్నా వినియోగానికి అనుమతి లభించింది. ఈ టీకాపై 6 కోట్ల డోసులను బ్రిటన్ పంపిణీ చేసింది.

కరోనా కట్టడి చేసేందుకు కొన్ని నెలల్లో సింగిల్ డోస్ టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ అంతం చేయగల సామర్థ్యం గల జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా 72శాతం సామర్థ్యం కలిగి ఉందని తేలింది. ఫలితాల ఆధారంగా బ్రిటన్ జే&జే వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.