Whisky Missing : విస్కీ బాటిల్‌ కనిపించట్లేదని అమెరికా అధికారులు ఆందోళన..ఆచూకీ కోసం విచారణ

Whisky Missing : విస్కీ బాటిల్‌ కనిపించట్లేదని అమెరికా అధికారులు ఆందోళన..ఆచూకీ కోసం విచారణ

Us State Dept Whisky Bottle Misssing

Us State Dept Whisky Bottle misssing : ఎవరన్నా బంగారం వంటి విలువైన వస్తువులు కనిపించకపోతే ఆందోళన చెందుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అదే ప్రభుత్వాలైతే విలువైన కీలక డాక్యుమెంట్లు, పేపర్స్ కనిపించకపోయినా, లెక్కల్లో తేడాలొచ్చిన ఆందోళన చెందుతారు. విచారణకు ఆదేశిస్తారు. కానీ అమెరికాలోని అధికారులు ఏమాత్రం ‘విస్కీ బాటిల్’ కనిపించకుండాపోయిందని ఆందోళన చెందారు. దాని కోసం ఏకంగా విచారణకు ఆదేశించారు. ఇది వినటానికి వింతగా ఉన్నా ఈ విషయం పెద్ద ఆసక్తికరంగా మారింది. ఓసాధారణ విస్కీ బాటిల్ కనిపించకపోతే ఇంత హడావిడా? దాని కోసం విచారణా? అది కూడా అమెరికా? అంటే ఇదేదో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందే అనిపించకమానదు.అవును మరి విషయం ఉంది కాబట్టే ఈ విస్కీ బాటిల్‌ కు అంతటి హడావిడి.

ఆ విస్కీ బాటిల్ ఖరీదు 5800 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4.30 లక్షలు. ఆ విస్కీ బాటిల్ ను జపాన్‌ ప్రభుత్వం 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియోకు గిఫ్టుగా ఇచ్చింది. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ బాటిల్‌ అధికారిక లెక్కల్లో మిస్ అయ్యింది. అదికనిపించకుండాపోవటంతో అధికారులు ఆందోళన చెందారు. ఆ విస్కీ బాటిల్ మిస్సింగ్ ను సీరియస్ గా తీసుకున్నారు. దాని లెక్క తేలాల్సిందేనంటూ విచారణకు ఆదేశించారు.

విదేశాంగ కార్యదర్శిగా పాంపియో ఉన్న సమయంలో జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు ఈ విస్కీ బాటిల్ ను గిఫ్టుగా ఇచ్చారు. దాన్ని పాంపియో స్వీకరించారా? లేదా? అనేది అస్పష్టంగా ఉంది.

అయితే ఈ అంశంపై పాంపియో అడ్వకేట్ మాట్లాడుతూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న గుర్తు లేదు..ఆ బాటిల్‌ ఎలా మాయమైంది? అనే విషయం కూడా ఆయనకు తెలియదని తెలిపారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు కనిపించకుండాపోవటంతో ఈ వార్త కాస్తా వైరల్ గా మారింది. దీని ఆచూకీ కోసం విచారణ చేపట్టారు.మరి ఈ విచారణలో సదరు విస్కీ బాటిల్ ఆచూకీ లభిస్తుందా? లేదా అనే విషయం తేలాల్సి ఉంది. భలే ఉంది కదూ విస్కీ బాటిల్ మిస్సింగ్ కోసం విచారణ.

కాగా ఏదైశానికి సంబంధించినవైనా అధికారంగా లెక్కల్లోకి వచ్చే ఏ చిన్నదైనా గానీ అంత విలువైనదనే చెప్పాలి.పలు దేశానికి చెందిన పలువురు ప్రముఖులు వేరే దేశస్తులు వివిధ రకాల బహుమానాలు ఇస్తుంటారు. అవి విలువైనవిగా లెక్కిస్తుంటారు.అటువంటివి మిస్ అయినప్పుడు ఇదిగో ఇటువంటి వింత విచారణలు వార్తల్లోకి వస్తాయి. వైరల్ గా మారతాయి.