COVID-19 Treatment: కోవిడ్-19 చికిత్స కోసం మెడిసిన్.. రూ. 25వేల కోట్ల ఖర్చుతో!

కరోనావైరస్ ప్రపంచాన్ని దశలవారీగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి.

COVID-19 Treatment: కోవిడ్-19 చికిత్స కోసం మెడిసిన్.. రూ. 25వేల కోట్ల ఖర్చుతో!

Medicine

US to spend $3.2B on COVID-19 treatments: కరోనావైరస్ ప్రపంచాన్ని దశలవారీగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. మహమ్మారిపై పోరాటానికి ఇప్పటివరకు మెడిసిన్ అనేది లేదు. మహమ్మారిని అరికట్టేందుకు మందు ఎప్పుడు వస్తుంది? ఈ పరిశోధన ఎంత దూరంలో ఉంది? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఇప్పటివరకు మందులేని కోవిడ్-19 వ్యాధిని అడ్డుకోవడానికి ప్రత్యామ్నాయాల ద్వారా చికిత్స అందిస్తోంది ప్రపంచం. అందుబాటులో ఉన్న మందులతోనే కరోనాను అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు 150కి పైగా డ్రగ్స్‌ను పరీక్షించి ఇప్పటివరకు కరోనాకు చికిత్స అందించారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా మెడిసిన్ తయారు చేయాలని అమెరికా యోచిస్తోంది. యాంటీవైరల్ మెడిసిన్ అభివృద్ధి చేయడానికి బైడెన్ ప్రభుత్వం 3.2 బిలియన్ డాలర్లు(భారత రూపాయలలో 25వేల కోట్లు) ఇవ్వబోతోంది. ఈ మెడిసిన్ తయారు చేయడంలో అమెరికా విజయవంతమైతే, కరోనా వైరస్ సంక్రమణ చికిత్స చాలా సులభం అవుతుంది.

ఈ మెడిసిన్ సక్సెస్ అయితే, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొదటి ప్రభావవంతమైన మెడిసిన్ ఇదే అవుతుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సలహాదారు, అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ ఈ ప్రణాళిక గురించి బిలియన్ డాలర్ల పెట్టుబడిని గురించి ప్రకటన చేశారు. ఈ డబ్బు ద్వారా, వివిధ మెడిసిన్‌ల క్లినికల్ ట్రయల్స్ వేగవంతం అవుతాయని, కరోనా వైరస్ సోకిన రోగులను కాపాడుకునేందుకు మెడిసిన్ త్వరగా చెయ్యాలని అమెరికా భావిస్తుందని అన్నారు. ఈ విచారణ విజయవంతమైతే, ఈ సంవత్సరం చివరినాటికి కరోనా వైరస్ ఫస్ట్ మెడిసిన్ ప్రపంచంలో ఇదే అవుతుందని అన్నారు.

ఫౌసీ మాట్లాడుతూ 3.2 బిలియన్ డాలర్లలో, 500 మిలియన్ డాలర్లు పరిశోధన మరియు అభివృద్ధికి మరియు 1 బిలియన్ డాలర్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ మరియు క్లినికల్ ట్రయల్స్ కోసం ఉపయోగించబడతాయని చెప్పారు. 700 మిలియన్ డాలర్లు మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తామని అన్నారు. అలాగే, కొత్త యాంటీవైరల్ డ్రగ్ డిస్కవరీ సెంటర్‌ను నిర్మించడానికి ఒక బిలియన్ డాలర్లు ఉపయోగించనున్నారు.

ప్రపంచంలో హెపటైటిస్ బి మరియు ఎయిడ్స్ వంటి అనేక వైరస్‌లకు మెడిసిన్ ద్వారా చికిత్స చేయవచ్చు కానీ, కరోనా వైరస్‌కు మాత్రం సరైన మెడిసిన్ లేదు. కరోనాపై పోరాటంలో అమెరికా వినియోగిస్తున్న మెడిసిన్ రెమ్‌డెసివిర్. కరోనా సోకిన రోగుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు.