పసిపిల్లలు, చిన్నారులకు కూడా అమెరికా డైట్ గైడ్‌లైన్స్, పిల్లలు ఏం తినాలంటే!

పసిపిల్లలు, చిన్నారులకు కూడా అమెరికా డైట్ గైడ్‌లైన్స్, పిల్లలు ఏం తినాలంటే!

Kids Food: కరోనా సమయంలో ఏది ఎలా తినాలనే దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఈ వార్త మరింత ప్రత్యేకం అయిపోయింది. సాధారణంగా ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారానికి సంబంధించి ప్రకటనలు చేస్తుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు చిన్నారులకు, పసి పిల్లలకు కూడా ప్రకటించింది. ఫెడరల్ గవర్నమెంట్ ఫీచర్ రికమెండేషన్స్ ఆధారంగా చిన్నారులకు, శిశువులకు కూడా డైట్ గైడ్‌లైన్స్ ప్రకటించింది యూఎస్.

ఇందులో ప్రత్యేకం ఏంటి
డైటరీ గైడ్‌లైన్స్ అనేవి ఐదేళ్లకోసారి అప్ డేట్ అవుతూ ఉంటాయి. స్కూల్ లంచ్ ప్రోగ్రామ్స్, రాష్ట్రం లోపల, స్థానికంగా హెల్త్ ప్రమోషన్స్ దృష్టిలో ఉంచుకుని తినాల్సినవి సూచిస్తూ తినకూడని వాటిని హెచ్చరిస్తుంటారు.

ప్రధానాంశంగా పేర్కొందేంటంటే..
పసిపిల్లలు తొలి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే తాగాలి. అలా చేయడంతో పాటు డి-విటమిన్ తీసుకుంటుండాలి.

* రెండేళ్ల లోపు: కచ్చితంగా షుగర్ యాడ్ చేసిన కంటెంట్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అందులో సోడియం లెవల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి.

* కేక్ తినకూడదు, ఐస్ క్రీమ్ క్యాండీ, చిప్స్ లాంటి వాటిని సెకండ్ బర్త్ డే తర్వాతే ఇవ్వాలి.

* కొత్త సూచనల ఆధారంగా ఆల్కహాల్, షుగర్ కంటెంట్ శరీరానికి ఎక్కువ అందకుండా చేయాలని ప్లాన్ చేశారు.

* ఇలా చేయడం వల్ల ఫుడ్ లో కలిసి క్యాలరీలు 10 నుంచి 6శాతం వరకూ తగ్గించినట్లు అవుతుందట.

* దాంతో పాటు మగవారు ఆల్కహాల్ డ్రింక్స్ రోజుకు 2నుంచి 1వరకూ మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.