ఒంటెను దొంగిలించి ప్రేయసికి గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు..

ఒంటెను దొంగిలించి ప్రేయసికి గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు..

UAE Man arrested camel gift for girl friend : ప్రేయసికి ప్రియుడు గిప్టులు ఇచ్చే విషయంపై ఎన్నో జోకులుంటాయి. నా ప్రేయసికి గిఫ్టులు ఇచ్చీ ఇచ్చీ నా జేబులు..నా ఎకౌంట్లు ఖాళీ అయిపోయాయనే జోకులు ఎన్నో విన్నాం. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రియుడు వెరీ డిఫరెంట్..ఎవరన్నా..డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, రోజ్, ఫోన్లు ఇలా ఎన్నో గిప్టులుస్తుంటారు.

కానీ ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసి పుట్టిన రోజుకు మాత్రం ఏకంగా మేలుజాతికి చెందిన ఒంటెను గిఫ్టు ఇచ్చాడు. అదీకూడా ఒంటెను దొంగిలించి మరీ గిఫ్టు ఇచ్చాడు. మరి ఎంతైనా ‘అరబ్’ప్రియుడు కదా..అందుకే ఒంటెను గిఫ్టు ఇవ్వాలనుకున్నాడేమో..!! అలా డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చిన ఫలితంగా.. పాపం ఆ వెర్రి ప్రియుడు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు..

ఈ డిఫరెంట్ లవర్ వివరాల్లోకి వెళితే..ఓ వ్యక్తి తన ఒంటె పోయిందని..తమ పొలంలో ఒంటెల్ని పెంచుకుంటున్నాననీ వాటిలో ఓ ఒంటె పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు సదరు ఒంటెను వెతకటానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతలో పోలీసులకు మరో ఫోన్ వచ్చింది. తన ఫాం హౌస్‌లో ఓ గుర్తు తెలియని ఒంటె వచ్చిందని ఓ వ్యక్తి ఫోన్ చేయటంతో..పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ఒంటెను గుర్తించి దాని యజమానికి అప్పగించారు. ఫాంహౌస్ యజమానిని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించేసరికి అసలు విషయం బయటకొచ్చింది. అది విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు..

తానే ఆ ఒంటెను దొంగిలించానని, తన ప్రేయసికి గిఫ్టు ఇవ్వటానికి మేలుజాతి ఒంటెను దొంగతనం చేశానని.. ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడితో పాటు అతడి ప్రేయసిని కూడా అరెస్టు చేశారు. ఒంటెను ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకున్న అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు అతడితో పాటు ఆమె కూడా జైల్లో పడింది. మరి విడుదలైన తరువాత అతడికి బ్రేకప్ చెబుతుందో ఏంటో..ఆ దేవుడికే తెలియాలి..!