UAE: ఒకే పేరుంటే యూఏఈలోకి నో ఎంట్రీ.. కొత్త రూల్ తీసుకొచ్చిన ఎమిరేట్స్

ఒకే పేరు మాత్రమే ఉన్న ప్రయాణికుల్ని ఇకపై తమ దేశంలోకి అనుమతించబోమని యూఏఈ ప్రకటించింది. యూఏఈ వెళ్లాలంటే ఇకపై పేరులో కనీసం రెండు పదాలు తప్పనిసరిగా ఉండాలి.

UAE: ఒకే పేరుంటే యూఏఈలోకి నో ఎంట్రీ.. కొత్త రూల్ తీసుకొచ్చిన ఎమిరేట్స్

UAE: తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణికుల విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఒకే పేరు ఉన్న ప్రయాణికులను ఇకపై యూఏఈలోకి అనుమతించబోమని ప్రకటించింది. ఇప్పటికే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. తాజా నిర్ణయం విషయంలో ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలని ఎయిర్ ఇండియా వంటి భారత విమానయాన సంస్థలు తెలిపాయి.

Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్ వ్యాధి.. నెల రోజుల్లో 13 మంది మృతి

పాస్‌పోర్టులో ఒకే పేరు.. అంటే ఒకే పదంతో ఉన్న పేరు కలిగిన ప్రయాణికుల్ని యూఏఈ తమ దేశంలోకి అనుమతించదు. పేరులో కనీసం రెండు పదాలు ఉండాలి. పేరు పక్కన ఇంటి పేరు లేదా మరో పదం ఉంటేనే యూఏఈలోకి అనుమతిస్తారు. అలా కాకుండా ఒకే పదంతో పేరు ఉన్న ప్రయాణికుల్ని ఐఎన్ఏడీ (ఇన్ అడ్మిసబుల్ ప్యాసింజర్)గా పరిగణిస్తారు. వీరికి ప్రవేశం నిషేధం. ఇలాంటి ప్రయాణికుల్ని విమానయాన సంస్థలు వెనక్కు పంపిస్తాయి. ఇలా ఒకే పేరు ఉన్న వారికి ఇకపై యూఏఈ వీసా మంజూరు చేయదు. ఒక వేళ వీసా మంజూరు చేసినా, వారిని ఐఎన్ఐడీ కింద దేశంలోకి అనుమతించరు.

వీరిని విమానాశ్రయంలోనే నిలిపివేస్తారు. ఈ నిబంధన విజిట్ వీసా, ఎంప్లాయ్‌మెంట్ వీసా, వీసా ఆన్ అరైవల్, టెంపరరీ వీసాలపై వచ్చే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే యూఏఈ రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్‌కు వర్తించదని యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది.