Uber Helicopter : ఉబెర్‌‌లో హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవచ్చా ?

న్యూయార్క్ ప్రాంతానికి చెందిన నికోల్ జాన్ ఎఫ్ కెన్నెడి విమానాశ్రాయానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉబెర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో క్యాబ్ తో పాటు హెలిక్యాప్టర్ సేవలు

Uber Helicopter : ఉబెర్‌‌లో హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవచ్చా ?

Uber

Uber Helicopter The Cheapest Option : ప్రైవేటు రవాణా సౌకర్యాలపై ఎంతో మంది ప్రజలు ఆధారపడుతుంటారు. వివిధ రాష్ట్రాల్లో యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. అందులో ఓలా, ఉబెర్, ర్యాపిడో..ఇతర కంపెనీలున్నాయి. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్స్ అందుబాటులో ఉంటాయి. ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే.. ఆయా యాప్స్ ఓపెన్ చేసి బుక్ చేసుకుని గమ్య స్థానాలకు చేరుకుంటారు. కానీ.. ఓ అమెరికా మహిళకు ఉబెర్ అనే సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువ ధరలో ‘హెలిక్యాప్టర్ సేవలు’ పొందవచ్చనే వార్త హల్ చల్ చేస్తోంది. ఉబెర్ సంస్థ సేవలు చేసి అవక్కాయిన ఆమె.. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన యూఎస్ లో చోటు చేసుకుంది.

Read More : Youtuber Record: 42 సెకన్లలో కోట్లు సంపాదించిన యూట్యూబర్

వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన నికోల్ జాన్ ఎఫ్ కెన్నెడి విమానాశ్రాయానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉబెర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో క్యాబ్ తో పాటు హెలిక్యాప్టర్ సేవలు ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఇది నిజమా అని మరోమారు చెక్ చేసుకుంది. ఉబెర్ ఎక్స్ కు 126.84 డాలర్లు, ఉబెర్ క్యాబ్ కు 102.56 డాలర్లు చూపించింది. హెలిక్యాప్టర్ మాత్రం 101.39 డాలర్లు మాత్రమే చూపించడం విశేషం. దీనిని ఆమె స్క్రీన్ షాట్ తీసి.. ట్విట్టర్ లో పోస్టు చేశారు. హెలిక్యాప్టర్ సేవలు ఉపయోగించుకోండి.. అంటూ సలహాలు ఇచ్చారు. నెటిజన్లు తలోరకంగా కామెంట్స్ చేశారు. హెలిక్యాప్టర్ ఎక్కడకు వస్తుందో చెక్ చేసుకోండి అంటూ సెటైర్స్ వేశారు. చివరిలో ట్విస్ట్ ఏంటంటే.. 2019, డిసెంబర్ 24వ తేదీన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.