చైనాలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ముస్లిం మహిళలే టార్గెట్

  • Published By: naveen ,Published On : September 5, 2020 / 01:41 PM IST
చైనాలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ముస్లిం మహిళలే టార్గెట్

చైనాలో మరోసారి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కలకలం రేగింది. ఓ ముస్లిం టీచర్ ఈ విషయాన్ని బయటపెట్టింది. తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపి ఆవేదన వ్యక్తం చేసింది. ముస్లిం మైనార్టీల బర్త్ రేట్ ను అణగదొక్కేందుకు చైనాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని తననను బలవంతం చేశారని 50ఏళ్ల ముస్లిం టీచర్ వాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని తనకు మేసేజ్ అందినట్టు టీచర్ సిదిక్ తెలిపారు.

తనకు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇది మొదటి సారి కాదని టీచర్ తెలిపారు. అప్పుడు 2017. నా వయసు 47ఏళ్లు. నాకు ఒక కూతురు ఉంది. యూనివర్సిటీలో చదువుకుంటోంది. మరోసారి ప్రెగ్నన్సీ రాకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని స్థానిక అధికారులు నన్ను ఒత్తిడి చేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మరోసారి అలాంటి ఒత్తిళ్లు చేస్తున్నారు అని టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వెస్ట్రన్ జియాంగ్ రీజియన్ లో ప్రముఖ ఇంటర్నెట్ క్యాంప్స్ లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తే ముస్లిం మైనార్టీ ప్రజలకు ఏం జరుగుతుందో నాకు తెలుసు అని ఆమె అన్నారు. రెండోసారి తనకు వచ్చిన మెసేజ్ ను ఆమె మీడియాతో పంచుకున్నారు.

”నీకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? నీ జీవితంతో ఆటలు ఆడొద్దు. అసలు అలాంటి ప్రయత్నం చేయొద్దు. ఇది కేవలం నీకు సంబంధించినది కాదు. నువ్వు నీ కుటుంబం గురించి, నీ బంధువుల గురించి, నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి కూడా ఆలోచన చేసుకో అని” ఆ మేసేజ్ లో ఉంది. ”నువ్వు మాతో పోరాటం చెయ్యాలని అనుకుంటే, మాకు సహకరించకుంటు, నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఇనుప చైర్ లో కూర్చోవాల్సి ఉంటుంది” అని ఆ సందేశంలో ఉంది.

చైనాలో ముస్లిం జనాభాను నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. అందుకు ఒప్పుకోని వారికి జరిమనాలు విధిస్తున్నారు. జైలుకి కూడా పంపుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఎక్కువగా ఉయ్ ఘర్ ముస్లిం వర్గానికి చెందిన వారు చైనాలో వివక్ష ఎదుర్కొంటున్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా ఆ వర్గంలో బర్త్ రేట్ బాగా పడిపోయింది.

ప్రెగ్నన్సీ రాకుండా ఉండేందుకు ఇంట్రా యుటెరిన్ డివైజ్(IUD) మహిళల దేహంలో అమరుస్తారు. గతంలో టీచర్ సిదిక్ దేహంలో ఈ పరికరాన్ని అమర్చారు. అయితే ఎక్కువ బ్లీడింగ్ కావడంతో ఆమె ఆ పరికరాన్ని ఎవరికీ తెలియకుండా తొలగించుకున్నారు. ఆ తర్వాత అధికారులు చేసిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో మరోసారి ఐయూడీని అమర్చుకోవాలని అధికారులు ఆమెను ఆదేశించారు. అప్పటికీ ఆమె అంగీకరించపోయే సరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

”2017లో నేను కేవలం ఓ స్కూల్ లో వర్కర్ ని. ఐయూడీ పెట్టుకో లేదా కుటుంబ నియంత్రణ ఆపరేసన్ చేయించుకో అని నాకు చాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మమిళ తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి తప్పకుండా నువ్వు కూడా చేయించుకోవాలి ” అని స్తానిక అధికారులు చెప్పినట్టు టీచర్ తెలిపారు. నా వయసు గురించి వారికి చెప్పాను. ఐయూడీ ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చెప్పాను. అయినా వారు వినిపించుకోలేదు. నాపై ఒత్తిడి తెచ్చారు అని టీచర్ వాపోయారు.