Anti Vaccine Protests: కరోనా కొత్త వేరియంట్లుగా హడలెత్తిస్తున్నా..వ్యాక్సిన్ మాకొద్దంటున్న బ్రిటన్ ప్రజలు

కరోనా కొత్త వేరియంట్లగా హడలెత్తిస్తున్నా..ఈనాటికి వ్యాక్సిన్ మాకొద్దంటున్న బ్రిటన్ ప్రజలు..వ్యాక్సిన్ వేయించుకోవటం..మా ఇష్టం..బలవంతంగా వ్యాక్సిన్లు వేస్తామంటూ ఊరుకోం అంటూ ఆందోళన.

Anti Vaccine Protests: కరోనా కొత్త వేరియంట్లుగా హడలెత్తిస్తున్నా..వ్యాక్సిన్ మాకొద్దంటున్న బ్రిటన్ ప్రజలు

Vaccination Is Not Mandatory (1)

Anti Covid Vaccine Protests: రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతునే ఉంది. అతి తక్కువ సమయంలోనే శాస్త్రవేత్తల కృషితో వ్యాక్సిన్లు వచ్చాయి. కానీ కరోనా టక్కులమారిగా మారుతు..కొత్త కొత్త వేరియంట్లుగా మారి ఇటు ప్రజల్ని హడలెత్తిస్తు..అటు శాస్త్రవేత్తలకు సవాలు విసురుతోంది. దీన్ని ప్రస్తుతం నియంత్రించటానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చారు. కానీ శాశ్వతంగా ఈ మహమ్మారిని ఖతం చేసే దిశగా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగాకృషి చేస్తున్నారు.

వ్యాక్సిన్లతో కరోనాను నియంత్రించాలని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నా..ఈనాటికి పలు దేశాల్లో ప్రజలు వ్యాక్సిన్లు వేయించుకోవటానికి ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు సరికదా..వ్యాక్సిన్లు వేయించుకునేది లేదని మొండిగా వాదిస్తున్నారు. వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిందేనని స్పష్టంచేస్తున్న ప్రభుత్వాలపైనే విరుచుకుపడుతున్నారు. ‘వ్యాక్సిన్లు వేయించుకునేది లేదు’అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇటువంటి వింత ఆందోళనలు పాశ్చత్యదేశాల్లోనే జరుగుతుండటం విశేషం.

Read more : Zero Rupee Note : భారత్ లో ’సున్నా‘ రూపాయి నోటు తెలుసా..?!

దీంట్లో భాగంగానే బ్రిటన్​లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్నా చాలామంది ప్రజలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. పైగా వ్యాక్సిన్లు వేయించుకునేది లేదు..ఈ నిర్భంధ వ్యాక్సిన్లు ఏంటీ? అని ప్రశ్నిస్తు ఆందోళన చేపట్టారు బ్రిటన్ వాసులు.

బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ తీవ్రరూపం దాల్చింది. కేసులు నానాటికి పెరుగుతునే ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్ పంపిణి ముమ్మరం చేసింది ప్రభుత్వం. కానీ జనాలు మాత్రం టీకాలు వేయించుకోవటానికి ఈనాటికి ముందుకు రావట్లేదు. పదే పదే హెచ్చరిస్తోంది ప్రజల్ని టీకాలు వేయించుకోవాలి అని.. కానీ ప్రజలు మాత్రం బలవంతంగా టీకాలు ఇస్తున్నారంటూ.. నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Read more : Aishwarya Rai Bachchan : ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు

‘యునైటెడ్ ఫర్ ఫ్రీడం’ మార్చ్‌ పేరిట సెంట్రల్ లండన్‌లో నిర్వహించిన ఆందోళనల్లో దాదాపు 5వేలమంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్​తో పాటు.. ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఫలితంగా నిరసనకారులు- పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది.