వావ్..రంగుల లోకం ఇంత అందంగా ఉంటుందా!..కళ్లద్దాలు పెట్టుకోగానే అవాక్కయిన యువకుడు

వావ్..రంగుల లోకం ఇంత అందంగా ఉంటుందా!..కళ్లద్దాలు పెట్టుకోగానే అవాక్కయిన యువకుడు

UK colour blind man shocked watching colours : రంగు రంగులోకం చూడాలంటే మనస్సే కాదు కళ్లుకూడా ఉండాలి కదా. కానీ కళ్లున్నాగానీ..అన్నీ చూడగలుగుతున్నాగానీ…రంగుల్ని మాత్రం చూడలేని వింత వ్యాధి ఉన్న యువకుడు మొదటిసారి రంగుల్ని చూసి అవాక్ అయ్యాడు. ఈ రంగుల లోకం ఇంత అందంగా ఉంటుందా? అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. పచ్చని చెట్లను, ఎర్రటి రంగులో మెరిసిపోతున్న కారుని చూసి తెగ ఆనంద పడిపోయాడు. అన్నీ చూడగలుగుతున్నాగానీ..రంగుల్ని చూడలేడా? అదేంటి అనే డౌట్ రావచ్చు..ఎందుకంటే ఆ యువకుడికి ‘కలర్ బ్లైండ్’ వ్యాధి ఉంది. దీంతో మొదటిసారిగా రంగుల ప్రపంచాన్ని చూసి అవాక్కయ్యాడు.

 

 

యూకేకు చెందిన మోకిన్లీ మాక్‌ అనే 22 యువకుడు పుట్టుకతోనే కలర్‌ బ్లైండ్‌. కాబట్టి మెకిన్లీ రంగుల్ని చూడలేడు. మెకిన్లీకి రంగుల్ని చూపించాలని అనుకున్నారు అతని స్నేహితులు. దాని కోసం ఓ కలర్‌ బ్లైండ్‌ గ్లాసెస్‌ కొని గిఫ్టుగా ఇచ్చారు. ఆ కళ్లద్దాలు పెట్టుకున్న మాక్‌ తెగ ఆశ్చర్యపోయాడు. ఆ కళ్లద్దాల్లోంచి బైటి ప్రపంచాన్ని చూస్తున్న ఆ కళ్లలో చెప్పలేని ఆనందం పొంగిపోయింది.

తన ఎదురుగా రంగురంగుల కార్లు, పచ్చని చెట్లు, రంగుల ఇళ్లను చూసిన మాక్ షాక్‌ అయ్యాడు. ఈ రంగు రంగుల ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా? అని ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. తన చుట్టు ఇంతటి అందమైన రంగుల ప్రపంచం ఉంటుందా? ఇంతకాలం నేను ఆ అందాన్ని చూడకుండానే పెరిగానా? ఇది నిజంగా చాలా చాలా విచారకం అని మాక్‌ పట్టనంత ఆనందంతో ఉక్కిరిబిక్కయ్యాడు.

ఇదంతా అతడి స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లలో వీడియో తీసి స్నేహితుడి కళ్లల్లో కనిపించిన ఆనందాన్ని ఆస్వాదించారు. ఆ తరువాత ఈ వీడియోను మాక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం (జనవరి 9,2021) షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోకు 2 మిలియన్‌లకు పైగా వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. మాక్‌ పట్టనంత సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్‌లు భావోద్వేగానికి గురవుతున్నారు. ‘ఇది చూసి నాగుండె బరువెక్కింది’, ‘ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో చూసే వారికి మీరు ఆదర్శంగా నిలిచారు..‘అసలైన రంగుల ప్రపంచాన్ని చూస్తునందుకు వెరీ హ్యాపీ. మీకు నిజంగా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారి ఎప్పుడు అలాగే ఉంచుకోండి’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు.