Crazy Job News : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

మంచంపై హాయిగా పడుకుంటే చాలా 25 లక్షల జీతం..ఇస్తామంటోంది ఓ కంపెనీ..

Crazy Job News : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

Job News Sleeping On Mattress

Job News Sleeping On Mattress: అబ్బా.. టైమ్ అయిపోతోంది. ఆఫీసుకు వెళ్లాలి. కానీ బెడ్ మీద నుంచి లేవబుద్ది కాదు. కానీ లేవాలి. ఆఫీసుకు వెళ్లాలి. అలాకాకుండా హాయిగా మంచం మీదనే పడుకుని చేసే జాబ్ ఏదైనా ఉండే బాగుండు అనిపిస్తుంది కదూ. కానీ అటువంటి ఉద్యోగాలు ఉంటాయా? ఉండనే ఉండవు అనుకుంటాం. కానీ ఉందండోయ్..మంచంమీద పడుకుని టీవీ చూస్తే చాలు లక్షల్లో జీతం ఇస్తామంటోంది ఓ కంపెనీ. ఏంటీ జోకా? అనుకుంటున్నారా? కాదు నిజమే. అక్షరాలా నిజం..!

UKకు చెందిన ‘క్రాఫ్టెడ్ బెడ్’ కంపెనీ ఇటువంటి జాబ్ ఆఫర్ చేస్తోంది. ఇలా బెడ్ మీద పడుకుని ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇటువంటి స్పెషల్ జాబ్ ను ఆఫర్ చేస్తోంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్ధికి కొన్ని కండిషన్స్ పెట్టింది ఆ కంపెనీ. అవికూడా చాలా ఈజీవే. సదరు వ్యక్తి మంచం మీద పడుకుని మాత్రమే టీవీ చూడాల్సి ఉంటుంది. దీని కోసం కంపెనీ ఆ అభ్యర్థికి పరుపులు, దిండ్లు పంపిస్తుంది. వాటితో పాటు చక్కటి జీతం కూడా ఇస్తుంది.+

Read more : US Job : CC టీవీ ఫుటేజ్ చూడటమే జాబ్..నెలకు రూ.30 వేల జీతం

కరోనా ప్రభావంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన ఇటువంటి సంక్షోభ సమయంలో ఇటువంటి ఉద్యోగం అంటూ జనాలు ఎగిరి గంతేస్తారు. ఇటువంటి సంక్షోభ సమయంలో పడుకుని చేసే ఉద్యోగ ఆఫర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూకేలో లగ్జరీ బెడ్ కంపెనీ ‘క్రాఫ్టెడ్ బెడ్స్’ ఈ ఉద్యోగం పొందిన వ్యక్తి ప్రతిరోజూ ఆరు నుండి ఏడు గంటలు మంచం మీద గడుకుని ఉండాలి. పరుపు, దిండ్లు ఎలా ఉన్నాయి. పడుకోవటానికి సౌకర్యవంతంగా ఉన్నాయా లేవా? అనేది చెప్పాలి.

క్రాఫ్టెడ్ బెడ్ ఇచ్చిన ప్రకటన ప్రకారం ఈ జాబ్ ప్రొఫైల్ కోసం ఎంపికైన వ్యక్తికి కంపెనీ నుండి సంవత్సరం ప్యాకేజీ 24 వేల పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 25 లక్షల రూపాయలు ఇస్తుంది. ఒక టెస్టర్ ప్రొఫైల్‌తో ఈ ఉద్యోగంలో భాగంగా..సదరు ఉద్యోగి ప్రతి వారం అతను పడుకునే పరుపులు, దిండ్ల గురించి వాటిలో నాణ్యత ఎలా ఉంది? పడుకోవటానికి సౌకర్యవంతంగా ఉందా? లేదా?లేకపోతే ఎలా ఉండాలి? వంటి విషయాలు చెప్పాలి. ఆ ఉద్యోగి చెప్పిన విషయాలన్ని ఆ కంపెనీ నోట్ చేసుకుంటుంది. తరువాత దానిని లెక్కిస్తుంది. అంతేకాకుండా ఆ పరుపు, దిండ్లలో చేయాల్సిన మార్పుల గురుంచి ప్రశ్నిస్తుంది. వాటికి అతను ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అదికూడా కరెక్ట్ గా చెప్పాలి. దాన్ని కంపెనీ నిపుణులు పరిశీలించి..చేయాల్సిన మార్పులు చేస్తారు.

Read more : Job offer : క్యాబేజీ కట్ చేసి ప్యాక్ చేస్తే చాలు..ఏడాదికి రూ.63 లక్షల జీతం..

ఈ ఉద్యోగంలో వర్క్ గురించి తెలిసింది కదూ..ఆ ఉద్యోగి వారానికి 37.5 గంటలు దిండుపై పడుకోవాలి. దీని ప్రకారం అతను ప్రతిరోజూ ఆరు గంటలు టీవీ చూడటం లేదా నిద్రపోవాల్సి ఉంటుంది. దీని కోసం ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన పనిలేదని కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ బ్రియాన్ డిల్లాన్ తెలిపారు. మా కంపెనీయే ఉద్యోగి ఇంటికి పరుపు, దిండు పంపిస్తుంది. అలాగే ఈ ఉద్యోగం పొందాలంటే సదరు అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పరిశీలిస్తారు. కాబట్టి అతను దిండ్లు గురించి పూర్తిగా పరిశీలించి దానికి సంబంధంచి సమీక్షను వ్రాసి పంపవచ్చు అని తెలిపారు.