Job offer : క్యాబేజీ కట్ చేసి ప్యాక్ చేస్తే చాలు..ఏడాదికి రూ.63 లక్షల జీతం..

అదొక ఫార్మింగ్ కంపెనీ. క్యాబేజీలు కట్ చేసి..వాటిని ప్యాక్ చేస్తే ఏడాదికి రూ.63లక్షలు జీతం అని ప్రకటించిందో కంపెనీ.

Job offer : క్యాబేజీ కట్ చేసి ప్యాక్ చేస్తే చాలు..ఏడాదికి రూ.63 లక్షల జీతం..

Job Offer 63 Lakh For Plucking Cabbage & Broccoli

job offer 63 lakh for plucking cabbage & Broccoli: వీడియోలు చూస్తు కూర్చుంటే చాలు చక్కటి జీతం. ముగ్గురు విద్యార్ధులకు చదువు చెప్పటానికి ఓ టీచర్ కావలెను ఏడాదికి లక్షల్లో జీతం. ట్రక్ డ్రైవర్ కు రూ.75 లక్షలకు పైగా జీతం. ఇలా ఇటీవల ఎన్నో ఉద్యోగాల గురించి వింటున్నాం. అటువంటిదే మరో ఉద్యోగం. చేయాల్సిన పని చాలా ఈజీ. కానీ జీతం మాత్రం భారీ.

అదేదో సాఫ్ట్ వేర్ కంపెనీ అనుకుంటే పొరపాటే.అదొక ఫార్మింగ్ కంపెనీ.జీతం ఏడాదికి రూ.64 లక్షలు అని ప్రకటించింది.చేయాల్సిన పని ఏంటంటే..క్యాబేజీలను కట్ చేసి..వాటిని ప్యాక్ చేయాలి. దీనికి సంబంధించిన ఉద్యోగానికి ఓ కంపెనీ రూ.ఏడాదికి దాదాపు రూ.64లక్షలు జీతాన్ని ప్రకటించింది. మరి అది ఎక్కడంటే..

Read more : Fair Isle : ముగ్గురు విద్యార్థుల కోసం టీచర్ కావలెను..జీతం రూ.57 లక్షలు

యూకేలోని బ్రిటన్‌కు చెందిన ఫార్మింగ్ కంపెనీ.. ప్యాకింగ్ పని చేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలను ఆఫర్ చేస్తూ రిక్రూట్‌మెంట్‌కు ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్‌కు చెందిన ఫార్మింగ్ కంపెనీ టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పొలంలో పండించిన క్యాబేజీలను తెంపి..వాటిని జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి.

Read more :Truck Drivers Salary : సరుకులు డెలివరీ ట్రక్కు డ్రైవర్‌ జీతం రూ.70.88 లక్షలు..!

దీని కోసం ఉద్యోగులు కావాలెను అని ప్రకటనలో తెలిపింది. ఆ ఉద్యోగానికి ఏడాదికి 62,400 పౌండ్లు భారత కరెన్సీలో సుమారు రూ.63లక్షల 20వేలు జీతం ప్రకటించింది. దీంతో టిహెచ్ క్లెమెంట్స్ & సన్ లిమిటెడ్ చేసిన ఈ ప్రకటన వైరల్‌గా మారింది. ఈ ప్రకటన చూసినవారు..ఈ బండ చాకిరీ ఉద్యోగం కంట అదేనయం మనం కూడా పోదాం పదండీ అంటున్నారు.