లండన్ జైలుకి నీరవ్ : నో బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 20, 2019 / 01:35 PM IST
లండన్ జైలుకి నీరవ్ : నో బెయిల్

పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆయనను 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ వెస్ట్ మినిస్టర్ కోర్టు బుధవారం(మార్చి-20,2019) ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను మార్చి-29,2019కి వాయిదా వేసింది.ఒకవేళ బెయిల్ కనుక మంజూరు చేస్తే నీరవ్ తిరిగి సరెండర్ అవరన్న ఉద్దేశ్యంతో జడ్జి అతడికి బెయిల్ నిరాకరించారు.ఈ కేసులో తన వాదనలు వినిపేంచేందుకు నీరవ్ కోర్టుని కోరినట్లు తెలుస్తోంది.
Read Also : దొంగ దొరికాడు : లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్

పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వస్తుందని ముందే గ్రహించి స్కామ్ బయటపడకముందే దేశం వదిలి పారిపోయాడు నీరవ్. లండన్ లో విలాసవంత జీవితం గడుపుతూ గెటప్ మార్చి రోడ్లపై దర్జాగా తిరుగుతున్న నీరవ్ స్థానిక రిపోర్టర్ కంటపడ్డాడు.నీరవ్ ని గుర్తించిన ఆ జర్నలిస్ట్ నీరవ్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు.అయితే నో కామెంట్స్ అంటూ నీరవ్ అక్కడినుంచి జారుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారత అధికారుల ఒత్తిడితో మంగళవారం లండన్‌లోని హోల్‌బర్న్‌ మెట్రో స్టేషన్లో  తిరుగుతుండగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నీరవ్ భారత్ కు ఎప్పుడు తిరిగివస్తాడన్నదానిపై క్లారిటీ లేదు.నీరవ్ కన్నా ముందు దేశం నుండి పారిపోయి లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యానే ఇప్పటివరకు దేశానికి రాలేదు.ఇక నీరవ్ వచ్చేసరికి చాలా టైం పట్టే అవకాశమన్నట్లు తెలుస్తోంది.
Read Also : మీసాల పిల్లి : నీరవ్ మోడీని ఆ కెమెరానే పట్టించింది!