బర్గర్ తినటానికి 160 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళకు రూ.20వేలు ఫైన్

బర్గర్ తినటానికి 160 కిలోమీటర్లు ప్రయాణించిన మహిళకు రూ.20వేలు ఫైన్

UK  Woman Burger Travel 160km : ఇష్టమైన ఫుడ్ తినటానికి ఎంత దూరమైనా వెళతారు చాలామంది. అలా తమకిష్టమైన ఫుడ్ తినటానికి ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన ఇద్దరు అక్కచెల్లెళ్లకు అధికారులు రూ.20వేలు ఫైన్ వేశారు.

ఇంతకూ విషయం ఏమిటంటే..యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్ భయంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. పాత కరోనాకు తోడు కొత్త కరోనా జనాలకు గడగడలాడిస్తుండటంతో రెండవసారి విధించిన ఈ లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఈక్రమంలో యూకేలోని లింకన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బర్గర్ తినాలనే ఆశతో ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లింది. తన సోదరితో కలిసి టూవీలర్ పై లింక్ నుంచి స్కోర్బోరో వరకూ వెళ్లింది. దీంతో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆ అక్కచెల్లెలిద్దరికి అధికారులు రూ.200 UK పౌండ్లు అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ20వేలు ఫైన్ వేశారు అధికారులు.

లింకన్ షైర్ లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళకు మెక్ డొనాల్డ్ బర్గర్ అంటే ప్రాణం. కొత్త కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ తో రెస్టారెంట్లు అన్నీ మూసివేశారు. దీంతో ఆమెకు బర్గర్ దొరకటం కష్టమైపోయింది.దీంతో ఆమె తన సోదరిని తీసుకుని మెక్ డొనాల్డ్ బర్గర్ కోసం బయలుదేరింది. అలా తను ఉండే లింకన్ షైర్ నుంచి బయలుదేరి స్కార్ బరె వరకూ వెళ్లింది. దీంతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెకు పోలీసులు రూ.200ల పౌండ్లు జరిమానా విధించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.20వేలు.

ఈ విషయంపై ఇన్స్పెక్టర్ రాచెల్ ఉడ్ మాట్లాడుతూ..కరోనా కేసులు తగ్గాయనుకుంటే ఈ కొత్త కరోనా వల్ల ప్రజలు భయంభయంగా కాలం గడుపుతున్నారనీ దీంతో కొత్తగా వస్తున్న స్ట్రెయిన్ ను నియంత్రించటానికి లాక్ డౌన్ విధించక తప్పలేదని..ఈక్రమంలో కేవలం ఫుడ్ కోసం ఇలా నిబంధనల్ని అతిక్రమిస్తే ఎలా? ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. అలా నిబంధనలు అతిక్రమించినవారికి జరిమానా తప్పదనీ హెచ్చరించారు.

అలా నిబంధనలు ఉల్లంఘించిన 70మందికి పైగా జరిమానాలు విధించామని తెలిపారు. కాబట్టి పరిస్థితుల రీత్యా ప్రజలు నిబంధనల్ని పాటించాలని..ఇంట్లోనే ఉండి ప్రజలు సహకరించాలని కోరారు.