Zero Covid Deaths UK : యూకేలో జీరో కొవిడ్ మరణాలు.. మార్చి 2020 నుంచి ఇదే తొలిసారి

యూకేలో జీరో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020 నుంచి జీరో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 28 రోజుల్లోపు కొత్తగా ఎలాంటి కొవిడ్ మరణాలు నమోదు కాలేదు.

Zero Covid Deaths UK : యూకేలో జీరో కొవిడ్ మరణాలు.. మార్చి 2020 నుంచి ఇదే తొలిసారి

Zero Covid Deaths Uk

UK Zero Covid-19 Deaths : యూకేలో జీరో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020 నుంచి జీరో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో మంగళవారం కరోనా పాజిటివ్ టెస్టులు చేయగా.. గత 28 రోజుల్లోపు కొత్తగా ఎలాంటి కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. బ్రిటన్‌లో మొదటి లాక్‌డౌన్‌లోకి వెళ్లడానికి ముందు చివరిసారిగా మార్చి 2020లో ఎలాంటి కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. మంగళవారం (జూన్ 1)న బ్రిటన్ లో కొవిడ్ సంబంధిత మరణాలు నమోదు కాలేదని, దేశం మొత్తం చాలా ఆనందంగా ఉంటుందని ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

యూకేలో లాక్ డౌన్లు, కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైంది. దీని ఫలితంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. 2020 ఏడాది జూలై 30 తర్వాత ఇంగ్లాండ్‌లో పాజిటివ్ కోవిడ్ టెస్టులు జరిగిన 28 రోజులలోపు ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ఇక స్కాట్లాండ్ లేదా ఉత్తర ఐర్లాండ్‌లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.

మరోవైపు టీకాలు సమర్థవంతగా పనిచేస్తున్నాయని అన్నారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికీ మరణాలు మాత్రం నమోదుకాకపోవడం సంతోకరమైన విషయంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు, చేతులను తరచుగా శుభ్రంచేసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

మహమ్మారితో బ్రిటన్ మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య 127,782గా ఉంది. ప్రపంచంలో ఐదో దేశంగా అత్యధికంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాలు చెబుతున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వ డేటా 3,165 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి.