#creativejobapplication: ఓ నిరుద్యోగి క్రియేటివిటీకి ఆ బడా కంపెనీ ఫిదా..పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది..!!

ఓ నిరుద్యోగి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించిన క్రియేటివిటీ వైరల్ గా మారింది. అతని వినూత్న ఆలోచనకు ఫిదా అయిన ఆ కంపెనీ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది. దీంతో అతని వినూత్న ఆలోచన..

#creativejobapplication: ఓ నిరుద్యోగి క్రియేటివిటీకి ఆ బడా కంపెనీ ఫిదా..పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చింది..!!

Uk Man #creativejobapplication

UK man #creativejobapplication :ఏ కంపెనీలో అయినా ఉద్యోగం సంపాదించాలి అంటే ఏం చేస్తారు? రెజ్యూమ్ ఇచ్చి ఉద్యోగం కోసం యత్నిస్తారు. సీవీలు, అప్లికేషన్ లు… ఇలా ఎన్నో విధాల తతంగం ఉంటుంది. పరీక్షలు, గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూలు దాటుకుని వెళ్లాలి. కానీ ఓ నిరుద్యోగి మాత్రం తను ఓ కంపెనీకి రెజ్యూమ్ ఇవ్వటంలో క్రియేటివిటీ ఉపయోగించి మరీ ఉద్యోగం సంపాదించేశాడు. నిరుద్యోగి కాస్తా ఉద్యోగి అయిపోయాడు తన క్రియేటివిటీతో..అతని వినూత్న యత్నం కంపెనీ సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా ఫిదా అయిపోయిన సదరు కంపెనీ అతనికి ఉద్యోగం ఇచ్చేసింది. అలి నిరుద్యోగి కాస్తా ఉద్యోగి అయిపోయాడు. ఇంతకీ అతని క్రియేటివిటీ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందేనండోయ్..

బ్రిటన్ కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఎన్నాళ్లినుంచో ఉద్యోగం కోసం యత్నిస్తున్నాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో ఏం చేయాలా? అని ఆలోచించాడు. ఇలా కూడా ట్రై చేద్దాం అనుకుని ఓ ఐడియా వేశాడు. యార్క్ షైర్ లోని ఇన్ స్టాంట్ ప్రింట్ అనే సంస్థ ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. దాంతో జోనాథన్ స్విఫ్ట్ కూడా దరఖాస్తు చేయాలని అనుకున్నాడు. కానీ అందరిలా కాకుండా వినూత్నంగా యత్నించాడు.

కొంచెం పేరున్న కంపెనీ కావడంతో భారీగానే దరఖాస్తులు వస్తాయని గ్రహించిన జోనాతన్ అందరిలా మామూలుగా రెజ్యూమే పంపితే తనను పట్టించుకోకపోవచ్చని అనుకున్నాడు. వెళితే గుంపులో గోవిందాలా ఉంటుందని అనుకున్నాడు. సరికొత్త పద్ధతిలో రెజ్యూమ్ ఇవ్వాలనుకున్నాడు. సదరు కంపెనీ కరపత్రాలను సేకరించి వాటిపై తన రెజ్యూమే వివరాలు వివరించాడు.

అక్కడితో అతని క్రియేటివిటీ ఆగలేదు. ఆ కరపత్రాలను కంపెనీ హెడ్డాఫీసు వద్ద పార్క్ చేసి ఉన్న కార్లకు అంటించాడు. ఇతగాడి పనులన్నీ అక్కడ అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఆ ఫుటేజిని పరిశీలించిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాస్సెల్… జోనాథన్ స్విఫ్ట్ కార్లకు అంటించిన కరపత్రాలను తెప్పించుకుని మరీ చదివాడు. భలే ఉందే ఇతగాడి ఐడియా అనుకుని నవ్వుకున్నాడు. క్రియేటివిటీకి ఫిదా అయిపోయాడు. ఇలాంటివాడే కావాలి అనుకున్నాడు. వెంటనే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయటం టకటకా జరిగిపోయాయి. అంతేకాదు వెంటనే అపాయింట్ మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు.

తమ కంపెనీకి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలు ఉన్నవాళ్లే కావాలని, అందుకే స్విఫ్ట్ ను ఉద్యోగంలోకి తీసుకున్నామని మార్కెటింగ్ మేనేజర్ వాస్సెల్ తెలిపారు. కాగా..స్విఫ్ట్ తన రెజ్యూమేను కార్లకు అంటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోను స్విఫ్ట్ కు ఉద్యోగం ఇచ్చిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీయే షేర్ చేసింది.