UK Man : 70ఏళ్లకు పైగా లైసెన్స్.. ఇన్సూరెన్స్ లేకుండానే కారు డ్రైవింగ్.. పోలీసులు ఏరోజూ ఆపలేదట.. కానీ..!

ఇన్నాళ్లుగా ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడా దొరక్కుండా రోడ్లపై కారు ఎలా నడిపాడో తెలియదు.. కానీ.. యూకేకు చెందిన ఓ వ్యక్తి.. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేదు..

UK Man : 70ఏళ్లకు పైగా లైసెన్స్.. ఇన్సూరెన్స్ లేకుండానే కారు డ్రైవింగ్.. పోలీసులు ఏరోజూ ఆపలేదట.. కానీ..!

Uk Man Man Driving Uninsure

UK Man : ప్రస్తుత రోజుల్లో బైకు లేదా కారు బయటకు తీస్తే చలాన్లు పడిపోవాల్సిందే.. అంత కఠినంగా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి మరి.. ఎక్కడ ఏ కొంచెం రూల్స్ అతిక్రమించినా ఫైన్ పడుద్ది.. ఇంటికి చలానా కట్టి రావాల్సిందే.. లేదంటే అటు నుంచి జైలుకే.. బండి సీజ్ చేయడం ఏదో ఒకటి తప్పదు.. ఒకప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ నిఘా నేత్రం నుంచి తప్పించుకోవడం అంత అషామాషీ వ్యవహారం కాదు..

కొంచెం రెడ్ లైన్ దాటినా.. అంతే సంగతులు.. ట్రాఫిక్ పోలీసులను దాటి పోవడం కష్టమే.. మరి.. ఇన్నాళ్లుగా ట్రాఫిక్ పోలీసులకు ఎక్కడా దొరక్కుండా రోడ్లపై కారు ఎలా నడిపాడో తెలియదు.. కానీ.. యూకేకు చెందిన ఓ వ్యక్తి.. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. కారుకు ఇన్సూరెన్స్ కూడా చేయించలేదట.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలా ఏకంగా 70ఏళ్లకు పైగా కారును ఏ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నాడట..

ఇన్నాళ్లుగా ఏ ట్రాఫిక్ పోలీసులు కూడా అతని కారును ఆపలేదట.. ఈ విషయం ఎవరో కాదు.. అతడే స్వయంగా చెప్పినమాట.. ఎందుకంటే.. 70ఏళ్ల తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు… అదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులకు చెప్పుకొచ్చాడు ఈ యూకే వ్యక్తి.. ఈ ఘటన యూకేలోని నాటింగ్‌హామ్‌లోని బుల్‌వెల్‌లో జరిగింది.

పెట్రోలింగ్‌లో ఉన్న ట్రాఫిక్ పోలీసు అధికారులు టెస్కో ఎక్స్‌ట్రా సమీపంలో ఈ కారు డ్రైవర్‌ను పట్టుకున్నారు. 1938లో జన్మించిన ఈ కారు డ్రైవర్ తనకు 12 ఏళ్ల నుంచి లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడని పోలీసులకు చెప్పాడు. ఇన్నాళ్ల తన కెరీర్‌లో తనను ఎప్పుడూ పోలీసులు అడ్డుకోలేదని చెప్పాడు. అదృష్టవశాత్తూ.. ఈ కారు డ్రైవర్‌కు ఎప్పుడూ ప్రమాదం జరగలేదు.

ఈ ఘటనపై బుల్‌వెల్, రైజ్ పార్క్ హైబరీ వేల్ పోలీసులు ఫేస్‌బుక్ పోస్ట్‌ చేశారు.. సిటీ నార్త్ OP ఆపరేషన్ రీచర్ బృందం షేర్‌వుడ్, కారింగ్‌టన్‌లలో ప్రో-యాక్టివ్ పెట్రోలింగ్‌లో ఉంది.. ఆ సమయంలో యూకే వ్యక్తి ఓ పాత తుప్పుపట్టిన కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. వెంటనే ఆ కారు నడిపే వ్యక్తిని అడ్డుకున్నారు.

అతడు చెప్పే మాటలు విన్నాక పోలీసు అధికారులు నమ్మలేకపోయారు.. అంత పాతదైన కారును ఎప్పుడూ పోలీసులు ఆపలేదని చెప్పడంతో కంగుతిన్నారు. నాటింగ్‌హామ్‌లో పెరిగిన ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలను మొత్తం చెక్ చేశారు. ఎక్కడా కూడా ఈ పాత కారుకు ప్రమాదం జరిగినట్టు దాఖలాలు లేవని పోలీసులు పోస్టులో తెలిపారు.

Read Also : AP Employees HRA : బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగుల హెచ్ఆర్ఏ చెల్లింపుల్లో మార్పులు