UK Man COVID-Positive : కోవిడ్‌‌‌తో సహజీవనం, పది నెలలు నుంచి పాజిటివ్..చివరకు

ఓ వ్యక్తికి మాత్రం ఎన్నిమార్లు టెస్టులు నిర్వహించినా..పాజిటివ్ అంటూ వచ్చింది. ఇలా ఒక నెల కాదు..రెండు నెలలు కాదు..ఏకంగా పది నెలల నుంచి ఇలాగే జరుగుతుండడంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.

UK Man COVID-Positive : కోవిడ్‌‌‌తో సహజీవనం, పది నెలలు నుంచి పాజిటివ్..చివరకు

Uk Covid

COVID-Positive For 305 Days : కరోనా వైరస్ శరీరంలో ఎన్ని రోజులు ఉంటుంది ? అంటే..వైరస్ సోకిన అనంతరం రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండి..మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, జాగ్రత్తలు పాటిస్తే..వైరస్ ను జయించవచ్చని వైద్యులు, నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం కరోనా టెస్టులు చేసుకున్న అనంతరం నెగటివ్ రావడంతో కరోనా నుంచి కోలుకున్నారని నిర్ధారించే వారు. అయితే..ఓ వ్యక్తికి మాత్రం ఎన్నిమార్లు టెస్టులు నిర్వహించినా..పాజిటివ్ అంటూ వస్తోంది. ఇలా ఒక నెల కాదు..రెండు నెలలు కాదు..ఏకంగా పది నెలల నుంచి ఇలాగే జరుగుతుండడంతో వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.

బ్రిటన్ లో ఈ వింత కేసు వెలుగులోకి వచ్చింది. 72 ఏళ్ల రిటైర్డ్ డ్రైవింగ్ టీచర్ డేవ్ స్మిత్ పశ్చిమ ఇంగ్లాండ్ లో బ్రిస్టల్ లో నివాసం ఉంటున్నారు. ఇతనికి పది నెలల ముందు కరోనా వైరస్ సోకింది. దీంతో అతను హోం క్వారంటైన్ కు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల అనంతరం పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అంటూ వచ్చింది. దీంతో కుటుంసభ్యులు కంగారు పడిపోయారు.

స్మిత్ కు ఎన్నిసార్లు పరీక్షలు జరిపినా..పాజిటివ్ రావడం..మళ్లీ హోం క్వారంటైన్ కు వెళ్లడం తంతు జరిగేది. ఒక్కోసారి స్మిత్ ఆరోగ్యం క్షీణించేదని, చనిపోతాడేమోనన్న భయం తమలో కలిగేదని కుటుంబసభ్యులు వెల్లడించారు. మొత్తం 43 సార్లు పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయని, గత సంవత్సరమంతా..తమకు నరకంలా గడిచిందని అతని భార్య లిండా వెల్లడించింది. చివరకు వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజుల అనంతరం నెగటివ్ వచ్చిందని..అంటే దాదాపు 305 రోజుల తర్వాత ఇలా జరగడంతో సెలబ్రేట్ చేసుకున్నామన్నారు. అయితే..అతని శరీరంలో వైరస్ ఎలా యాక్టివ్ గా ఉంది ? తదితర విషయాలపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు.