Princess Diana Statue: తల్లి ప్రిన్సెస్ డయానా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రిన్స్ విలియం, హ్యారీ..అన్నదమ్ములు ఒక్కటయ్యారా..

ప్రిన్సెస్ డయానా. .ప్రిన్సెస్ అఫ్ వేల్స్..అందానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆమె జీవితమే కాదు మరణం కూడా సంచలమే. అటువంటి అందాల రాశి ప్రిన్సెస్ డయానా డయానా 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమారులు ప్రిన్స్ విలియం, హ్యారీ ఇద్దరూ కలిసి గురువారం తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Princess Diana Statue: తల్లి ప్రిన్సెస్ డయానా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రిన్స్ విలియం, హ్యారీ..అన్నదమ్ములు ఒక్కటయ్యారా..

Princess Diana Statue (1)

Princess Diana Statue: ప్రిన్సెస్ డయానా. .ప్రిన్సెస్ అఫ్ వేల్స్..అందానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆమె జీవితం ఆమె మరణం కూడా సంచలమే. కారు యాక్సిడెంట్ లో ఆమె మరణం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సంచనలమైన విషయం తెలిసిందే. అటువంటి అందాల రాశి ప్రిన్సెస్ డయానా డయానా 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమారులు ప్రిన్స్ విలియం, హ్యారీ ఇద్దరూ కలిసి గురువారం (జులై 1,2021)న తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రిన్సెస్ డయానా జీవించిన రోజుల్లో నివాసమున్న లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని గార్డెన్ లో తల్లి విగ్రహాన్ని కొడుకులిద్దరూ ఆవిష్కరించారు. కాగా..2017 లో డయానా విగ్రహం పనులు తయారీ ప్రారంభించినా ఇన్నేళ్లకు ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్స్ విలియం, హ్యారీలు తమ తల్లి జీవితాన్ని ఆమెతో గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆమెలాగా ఆదర్శంగా ఉండేందుకు ఈ విగ్రహం తమకు తోడుగా..స్ఫూర్తిదాయంగా ఉంటుందని అన్నారు.

కాగా..కాగా డయానా ఇద్దరు కొడుకుల మధ్యా కొంత విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ తల్లి 60వ పుట్టిన రోజు సందర్భంగా వారిద్దరూ కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించటంలో ఆసక్తిగా మారింది. ఇద్దరి మధ్యా విభేదాలు తొలగిపోయాయనే అందరూ అనుకుంటున్నారు. అదే నిజం కావాలని వారి సన్నిహితులు అభిమానులు కోరుకుంటున్నారు.కానీ వారి మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయా? లేక మరేదైనా గానీ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మాత్రం అవేమీ కనిపించలేదు. ఇద్దరూ సాధారణంగానే ఉన్నారు. 1997 లో పారిస్‌లో జరిగిన ఓ కారు ప్రమాదంలో 36 ఏళ్ల వయసులో ప్రిన్సెన డయానా మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలామంది ఆమె స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా గౌరవిస్తారు. ఆదర్శంగా తీసుకుంటారు.

కాగా..ప్రిన్సెస్ డయానా వాడిన కారు ఫోర్డ్ ఎస్కార్ట్.. మంగళవారం చిలీలోని ఒక మ్యూజియం 72,000 యూస్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఈ కారు ప్రిన్సెస్ డయానా వివాహానికి రెండు నెలల ముందు ప్రిన్స్ చార్లెస్ 1981 మేలో గిఫ్ట్ గా ఇచ్చారంట. ఈ కారు ఇప్పటికీ బ్రిటిష్ రిజిస్ట్రేషన్ ప్లేట్ WEV 297W తోనే ఉండడం గమనార్హం.గురువారం జరిగిన వేడుకల్లో రాయల్ కుటుంబీకులు మాత్రమే పాల్గొన్నారు. ఇది వారి వ్యక్తిగత వేడుకలా నిర్వహించుకున్నారు. అయితే, అందరి కళ్లు మాత్రం ప్రిన్సెస్ డయానా కుమారులపైనే ఉంది.

గత వారం కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చిన హ్యారీ, ఇటీవల తన తాత ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అలాగే తన అమ్మమ్మ క్వీన్ ఎలిజబెత్ II ను ఏప్రిల్‌లో కలిసినట్లు తెలుస్తోంది. అయితే, బ్రిటిష్‌ యువరాజు హ్యారీ, ఆయన సతీమణి మేఘాన్‌ మెర్కెల్‌లు వారి కుమారుడు ప్రిన్స్‌ ఆర్చీతో సహా రాజకుటుంబ సభ్యుల హోదాను వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిని రాజ కుటుంబం కూడా ఖండించింది. అయితే, హ్యారీ ఎప్పుడు తిరిగొచ్చినా తమకు అభ్యంతరం లేదని కూడా రాజ కుటుంబం ప్రకటించింది.

ప్రిన్స్ విలియం, హ్యారీ ఇద్దరూ కలిసి గురువారం వారి తల్లి ప్రిన్సెస్ డయానా 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సెస్ డయానా గతంలో నివాసమున్న లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని తోటలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు.