Britain PM Rushi Sunak : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్ .. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న కొత్త నేత

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు రిషి సునక్.ప్రభుత్వం ఏర్పాటుకు కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ఆహ్వానించారు. కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ప్రధానిగా ప్రకటించారు.బ్రిటన్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్..  ప్రధానిగా ఎన్నిక అయిన రిషి సునక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రిషి మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు.

Britain PM Rushi Sunak : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునక్ .. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న కొత్త నేత

Rishi Sunak meets King Charles III

Britain PM Rushi Sunak : బ్రిటన్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునక్ ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈక్రమంలో ప్రభుత్వం ఏర్పాటుకు కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ఆహ్వానించారు. కింగ్ చార్లెస్ రిషి సునక్ ను ప్రధానిగా ప్రకటించారు.బ్రిటన్ ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్.. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​ అనుమతి తీసుకున్న అనంతరం ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు.  ప్రధానిగా ఎన్నిక అయిన రిషి సునక్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రిషి సునక్ ప్రధాని హోదాలో మాట్లాడుతూ..తక్షణమే పని మొదలుపెడతానని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి చర్యలు తీసుకుంటానని..దీనికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కాస్త కఠినంగా ఉంటాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఏమాత్రం ఆలస్యం చేకుండా వెంటనే పనులు మొదలుపెడతానని వెల్లడించారు. ఏది ఏమైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి నాశక్తికి మించి పనిచేస్తానని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని..ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరోసారి హామీ ఇచ్చారు రిషి సునక్. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటమే మా ప్రధాన ఎంజెండా అని..ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరితో కలిసి పనిచేసి బ్రిటన్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని..పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు.

Anand Mahindra-Rishi Sunak : విన్‌స్టన్ చర్చిల్ చేసిన అవహేళనకు 75ఏళ్ల తరువాత బ్రిటీష్ వారికి రిషి సునాక్ ధీటైన సమాధానం

బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన సునాక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 మంగళవారం (అక్టోబర్ 25,2022) ఆహ్వానం పలికారు. ఈ పిలుపు అందుకున్న సునాక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండానే బ్రిటన్ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. ఇక అతి త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.బ్రిటన్ చరిత్రలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టడం ఇదే తొలి సారి కావటం విశేషం. అంతేకాదు ఆయన ప్రముఖ వ్యాపార దిగ్గజనం ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడు కూడా.

కాగా.. ఇటీవలే జరిగిన ప్రధాని ఎన్నికల్లో సునాక్ పై విజయం సాధించిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండో మారు ప్రధాని పదవికి సునాక్ పోటీ చేశారు. ప్రధాని పదవికి నామినేషన్ గడువు ముగిసే సమయానికి సునాక్ ఒక్కరి నామినేషనే బరిలో ఉండటంతో ఆయననే కన్జర్వేటివ్ పాప్టీ తమ నేతగా ఎన్నుకుంది. అయితే ప్రధాని పదవిని ఎన్నిక లేకుండా ఎలా పూర్తి చేస్తారంటూ ఓ వైపు విపక్ష లేబర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా… అవేవీ పట్టించుకోకుండా సునాక్ ప్రధాని పదవిని అధిష్టించారు. రిషిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానని భరోసా ఇస్తున్నారు రిషి సునక్. ఆర్థిక మంత్రిగా తనకున్న అనుభవాన్ని రంగరించి పెను సవాళ్ల మధ్య ప్రధాని బాధ్యతలు అందుకున్న సునక్ తనదైన శైలిలో సమస్యలను అధిగమిస్తానని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Infosys Narayana Murthy-Rushi Sunak : రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉంది : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

భారత్ కు 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తరుణంలో భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ చేసిన అవహేళనకు రిషి సునక్ బ్రిటీష్ వారికి ప్రధానిగా ఎన్నికై సరైన సమాధానం చెప్పారనే ప్రశంసలు వస్తున్నవేళ మరోసారి భారతీయుల శక్తి సామర్థ్యాలు..ప్రతిభా పాటవాలు రిషి సునక్ తన తెలిివితేటలతో ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించాలని ఆశిద్దాం..