UK: ప్రధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి ఎన్నిక కాక‌పోతే బ్రిట‌న్‌ను జాత్యాహంకార దేశంగా చూస్తార‌న్న నేత‌.. స్పందించిన రిషి

''ఒకవేళ యూకే త‌దుప‌రి ప్ర‌ధాని పోటీలో రిషి సున‌క్ ఓడిపోతే మ‌న దేశానికి చెడ్డ పేరు వ‌స్తుంది. బ్రిట‌న్‌ను జాత్యాహంకార దేశమ‌ని అంటారు'' అని కన్జర్వేటివ్ పార్టీ మ‌ద్ద‌తుదారుడు రామి రేంజర్ అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రిషి సున‌క్ స్పందిస్తూ... ''మా పార్టీ త‌దుప‌రి నాయ‌కుడి, బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి జ‌రుగుతోన్న ఈ పోటీలో జాత్యాహంకారం అంశం సాధ‌నం కాదు. ఓటు వేసే అంశంలో టోరీ స‌భ్యులు లింగ‌, జాతి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. జాత్యాహంకారం అనే అంశం ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతుంద‌ని నేను భావించ‌ట్లేదు'' అని చెప్పారు.

UK: ప్రధానిగా భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి ఎన్నిక కాక‌పోతే బ్రిట‌న్‌ను జాత్యాహంకార దేశంగా చూస్తార‌న్న నేత‌.. స్పందించిన రిషి

Liz Truss Poised To Become Next PM

UK: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి రేసులో జాత్యాహంకారం అంశం సాధ‌నం కాద‌ని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ అన్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. బ్రిట‌న్ ప్ర‌ధాని పదవి కోసం పోటీపడుతోన్న‌ ఇద్దరిలో ఒకరిగా రిషి సునక్ ఉన్నారు. ఈ నేపథ్యంలో జాత్యాహంకారం అనే ప‌దాన్ని వాడుతూ ఓ నేత చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

”ఒకవేళ యూకే త‌దుప‌రి ప్ర‌ధాని పోటీలో రిషి సున‌క్ ఓడిపోతే మ‌న దేశానికి చెడ్డ పేరు వ‌స్తుంది. బ్రిట‌న్‌ను జాత్యాహంకార దేశమ‌ని అంటారు” అని కన్జర్వేటివ్ పార్టీ మ‌ద్ద‌తుదారుడు రామి రేంజర్ అన్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రిషి సున‌క్ స్పందిస్తూ… ”మా పార్టీ త‌దుప‌రి నాయ‌కుడి, బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి జ‌రుగుతోన్న ఈ పోటీలో జాత్యాహంకారం అంశం సాధ‌నం కాదు. ఓటు వేసే అంశంలో టోరీ స‌భ్యులు లింగ‌, జాతి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. జాత్యాహంకారం అనే అంశం ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతుంద‌ని నేను భావించ‌ట్లేదు.

ఉత్త‌మ నేత‌ను ప్ర‌ధానిగా ఎన్నుకోవ‌డంపైనే మా పార్టీ స‌భ్యులు దృష్టి పెడ‌తారని అనుకుంటున్నాను. ఇత‌ర అంశాలను వారు ప‌ట్టించుకోరు. ప్ర‌ధానిగా గెలిస్తే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా నేను ప‌నిచేస్తాను” అని చెప్పారు. అత్యధిక ఓట్లు సాధించిన నేత‌ కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించడంతోపాటు, బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 5న ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, రిషి సునక్‌ 1980, మే 12న ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయ‌న‌ పూర్వీకులది ఇండియాలోని పంజాబ్‌.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా