గొడవపడిన వ్యక్తికి ముద్దు పెట్టి..నాలుక కొరికేసిన మహిళ..తెగిన నాలుక ముక్కను ఎత్తుకుపోయిన పక్షి..

గొడవపడిన వ్యక్తికి ముద్దు పెట్టి..నాలుక కొరికేసిన మహిళ..తెగిన నాలుక ముక్కను ఎత్తుకుపోయిన పక్షి..

UK Woman bites off man’s tongue : ఒక మహిళ ఒక వ్యక్తి నాలుకను కొరకగా తెగిన ముక్కను సముద్రపు పక్షి నోటకరుచుకునిపోయింది. దీంతో తెగిన నాలుకను సర్జరీ ద్వారా అతికించేందుకు అవకాశం లేకపోవడంతో అతడు మూగవాడయ్యాడు. ఈ అరుదైన ఘటన

అది గ్రేట్ బ్రిటన్‌లోని స్కాట్‌లాండ్‌ దేశంలోని ఎడిన్‌బర్గ్‌. అక్కడ ఓ దారిగుండా జేమ్స్‌ మెకెంజీ అనే వ్యకి, బెథానీ ర్యాన్‌ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిద్దరికి గతంలో కనీసం పరిచయం కూడా లేదు. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య అనుకోకుండా గొడవ జరిగింది. అదికాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఒకరిపై మరొకరు అరుచుకున్నాడు. దీంతో మెకెంజీకి ఆమెమీద బాగా ఆగ్రహం కలిగింది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పిడికిలి బిగించి ఆమె మీదకు వెళ్లబోయాడు. బెథానీ కాస్త వెనక్కి తగ్గింది. జేమ్స్ మరింతగా ఆమె మీదకు వచ్చి ముఖంమీద పిడికిలితో ఒక్క షాట్ ఇద్దామనుకున్నాడు. కానీ అప్పుడే జరిగింది ఊహించన ఘటన..

బెథానీ ర్యాన్ సడెన్ గా జేమ్స్ లిప్ కిస్‌ చేసింది. ఓ మహిళ ముద్దు పెట్టుకుంటే ఏ మగాడు మాత్రం ఏచేస్తాడు? జేమ్స్ తగ్గిపోయాడు. తాను కూడా కిస్ కు సహకరిస్తుండగా బెథానీ ర్యాన్ సడెన్ గా జేమ్స్ మెకెంజీ నాలుక చివరి భాగాన్ని కొరికింది. అది తెగి కింద పడింది. అప్పుడే వారిద్దరూ కూడా ఊహించన మరో ఘటన జరిగింది. అక్కడే ఏ చెట్టుమీదుందో తెలీదు గానీ ఒక సిగుల్‌ పక్షి తెగి పడిన నాలుక ముక్కను నోటకరుచుకుని ఎంత ఫాస్టుగా వచ్చిందో అంతే ఫాస్టుగా గాల్లోకి ఎగిరిపోయింది.

ఈ గందరగోళం మధ్య నాలుక తెగి రక్తం కారుతున్న మెకెంజీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తెగిన మూడు సెంటీమీటర్ల నాలుక ముక్క కనిపించపోవడంతో డాక్టర్లకు అతనికి సర్జరీ చేయటానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అతడు మాట్లాడలేని వ్యక్తిగా మిగిపోయాడు. 2019 ఆగస్ట్‌ 1న జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన ఎడిన్‌బర్గ్‌ ఫరీఫ్ కోర్టు మెకెంజీ నాలుక కొరికిన ర్యాన్‌ను దోషిగా నిర్ధారించింది.