కడుపులో బిడ్డ ఉండగానే..మళ్లీ గర్భందాల్చిన మహిళ..3 వారాల్లో రెండుసార్లు

కడుపులో బిడ్డ ఉండగానే..మళ్లీ గర్భందాల్చిన మహిళ..3 వారాల్లో రెండుసార్లు

Woman Double Pregnancy : సృష్టిలో ఎన్నో ఆశ్చర్యాలు..మరెన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ ఓ మహిళ విషయంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని అద్భుతం జరిగింది. మహిళ శరీరం అంతా ఓ సూపర్ కంప్యూటర్ అని ఓ నిపుణుడు అన్నట్లుగా..ఓ మహిళ గర్భంతో ఉండగానే ఆ బిడ్డ పుట్టకుండానే మరోసారి గర్భం దాల్చిన విచిత్రం షాక్ కు గురిచేస్తోంది.

అప్పటికే గర్భంతో ఉన్న ఓ మహిళా మళ్లీ గర్భవతి అయ్యింది. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘సూపర్ఫెటేషన్’ లేదా ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ అంటారు. ఈ అత్యద్భుత అరుదైన ఘటనలో ఆ గర్భిణీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డలకు క్షేమంగా జన్మనిచ్చిందా? అనేది పెద్ద ఆసక్తి కరంగా మారింది. ఇంగ్లాండ్‌లోని ట్రౌబ్రిడ్జ్‌లో నివసిస్తున్న రెబక్కా రాబర్ట్స్ అనే 39 ఏళ్ల మహిళకు ఈ విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

గత డిసెంబర్ లో జరిగిన ఈ  అద్భుత ఘటన వివరాలు..రెబక్కా రాబర్ట్స్కు 39 ఏళ్లు, ఆమె భర్త రైస్ వీవర్ కు 43ఏళ్లు, వారికి సమ్మర్ అనే 14 ఏళ్ల కూతురు ఉంది. ఇటీవల రెబెక్కా మళ్లీ గర్భం దాల్చింది. మూడు వారాలు గడిచాయి. గర్భంతో ఉన్నప్పుడు ఆమె కడుపులో ఇంకో బిడ్డ రూపుదిద్దుకున్నట్లుగా తెలిసి షాక్ అయ్యింది. అది ఆమెకే కాదు డాక్టర్లకు కూడా షాక్ కలిగించింది.

తాను గర్భం ధరించాకు బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి డాక్టర్లు స్కాన్ చేశారు. అప్పుడు గర్భంలో ఒక్క బిడ్డే ఉంది. అలా రెండు సార్లు స్కానింగ్ చేయించుకోగా ఒక్కబిడ్డే ఉంది. కానీ మరోసారి అంటే గర్భం దాల్చిన మూడు వారాల తరువాత మరోసారి స్కాన్ చేయించుకోగా..ఈసారి మాత్రం గర్భంలో రెండో బిడ్డ కూడా ఉందని తేలింది. దీంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. మూడు వారాల తర్వాత కవల పిల్లలు ఉన్నారని డాక్టర్లు చెప్పారు. అది విన్న రెబెక్కా షాక్ అయ్యింది. కేవలం మూడు వారాల్లో మరో బిడ్డ ఎలా రూపుదిద్దుకుంటుందని..ఆశ్చర్యపోయింది. దీన్ని వైద్యపరిభాషలో ‘సూపర్ఫెటేషన్’ లేదా ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ అంటారని డాక్టర్లు తెలిపారు.

అలా ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించింది.దానికి డాక్టర్లు గర్భం దాల్చడం కోసం రెబెక్కా వాడిన మందుల వల్లే ఆమెకు ‘డబుల్ ప్రెగ్నెన్సీ’ వచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఆమె తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంతో ఉన్నప్పుడు మరో అండం విడుదలై ఉంటుదని, అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని అంచనావేస్తున్నారు. కాగా..వైద్య నిపుణులు ‘సూపర్ఫెటేషన్’కు కారణమయ్యే పరిస్థితుల గురించి పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు.

రెబక్కా… 33 వారాల తర్వాత 2020, సెప్టెంబరు నెలలో రెబెక్కా కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో మగ బిడ్డ, మరొకరు ఆడబిడ్డ. మగపిల్లాడు 4lb 10oz బరువుండగా, ఆడ పిల్ల 2lb 7oz బరువు ఉంది. దీంతో ఆడ బిడ్డను కొద్దిరోజులు హాస్పిటల్‌లో ఉంచారు. చిన్నారి పూర్తిగా ఆరోగ్యంతో కొలుకొనే వరకు సుమారు మూడు నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఎట్టకేలకు డిసెంబరు 25న చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. సాధారణంగా కవల పిల్లలుగా పుట్టినవారికి ఒకే రకమైన పోలికలుంటాయి. కానీ రెబెక్కాకు జన్మించిన కవల పిల్లలకు వేర్వేరు పోలికలతో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది వైద్య రంగలో అద్భుతంగా డాక్టర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఇటువంటి కేసులు నమోదు చేయబడ్డాయని వారు స్పష్టం చేస్తున్నారు.

కాగా..స్పర్మ్ ద్వారా ఫెర్టిలైజ్ అయిన ఎగ్..కొన్ని రోజుల తరువాత గర్భంలో ఇంప్లాంట్ జరిగితే రెండు సార్లు గర్భం దాల్చే అవకాశముంటుంది. ఇలా జరగడాన్నే సూఫర్‌ఫెటేషన్ అంటారని..రెబెక్కా విషయంలో అదే జరిగి ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. కాగా..2016లో ఆస్ట్రేలియా మహిళలో కూడా ఇటువంటి సూపర్‌ఫెటేషన్ కేసే నమోదైంది. ఆమె కేవలం 10 రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. 10 రోజుల వ్యవధిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.