Guinness Record : తిండితో 27 రకాల గిన్నీస్ రికార్డ్స్ సాధించిన యువతి..బకాసుడికి బామ్మా ఏంటీ..!

బండెడు అన్నం..రెండు దున్నపోతులు తినే బకాసురుడికి బామ్మా ఏంటీ అనిపించి ఏకంగా తిండిలో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిందో మహిళ.

Guinness Record : తిండితో 27 రకాల గిన్నీస్ రికార్డ్స్ సాధించిన యువతి..బకాసుడికి బామ్మా ఏంటీ..!

Uk Woman Sets Guinness World Record For Eating 19 Chicken Nuggets In A Just One Minute,

UK women Foodie Guinness : చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండాలి. ఆ పేజీ.. గిన్నిస్ బుక్‌లో ఉంటే. అంతకంటే ఘనత ఏంటుంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించటానికి చాలామంది చాలా విధాలుగా యత్నిస్తుంటారు. కానీ గిన్నిస్ రికార్డు సాధించాలంటే.. గిన్నిస్ బుక్ ఓపెన్ చేసినంత ఈజీ కాదు. అలాగనీ.. అదేమంత పెద్ద కష్టం కూడా కాదని.. కొందరు నిరూపిస్తుంటారు. సిల్లి సిల్లీ పనులతో రికార్డు క్రియేట్ చేస్తుంటారు. చూడటానికి సిల్లీగా ఉన్నా దాంట్లో ఓ క్రియేటివిటీ ఉండాల్సిందే. అలా అయితేనే రికార్డు సాధిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి అమ్మాయి గురించే. ఆమె గురించి తెలిశాక.. ఇలా కూడా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కొచ్చా? అని కచ్చితంగా అవాక్కవుతారు. తిండిలో చాలామంది రికార్డు సాధించారు. కానీ ఈమెగారిని చూస్తే..వామ్మో..బకాసుడికి బామ్మా అనిపిస్తుంది.

Also read : World Biggest Strawberry : పావుకిలోకంటే పెద్ద స్ట్రాబెర్రీ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు..

గిన్నిస్ రికార్డ్ కొట్టాలంటే.. గొప్పగా ఏదో చేయాల్సిన పనిలేదు. కొత్తగా చేసినా సరిపోతుంది. అది కూడా కుదరకపోతే.. ఇప్పటివరకు గిన్నిస్ రికార్డులు సాధించిన వారి రికార్డులను బ్రేక్ చేసినా.. అదే రికార్డ్ మన పేరు మీదకు మారిపోతుంది. కాకపోతే.. వాళ్లకంటే వేగంగా చేయగలగాలి. అలా.. తిండితోనూ.. మొండిగా రికార్డులు బద్దలు కొట్టొచ్చని ప్రూవ్ చేసింది ఈ అమ్మాయి. యూకేకి చెందిన లియా షట్కీవర్.. కేవలం ఒక్క నిమిషంలోనే.. 352 గ్రాములున్న 19 చికెన్ నగ్గెట్స్‌ని తిని.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

ఫాస్ట్ ఫుడ్స్‌లో.. చికెన్ నగ్గెట్స్ చాలా ఫేమస్. జంక్ ఫుడ్ లవర్స్‌ అంతా.. చికెన్ నగ్గెట్స్ అంటే ఎంతో ఇష్టపడతారు. కరకరలాడుతూ.. చాలా టేస్టీగా ఉంటాయ్. దీంతో.. చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు.. చికెన్ లవర్స్ అంతా నగ్గెట్స్‌ని ఇష్టంగా లాగించేస్తారు. పకోడీ సైజులో ఉండే చికెన్ నగ్గెట్స్‌ని.. సాధారణ వ్యక్తి.. ఒకేసారి 2 వందల నుంచి 250 గ్రాముల దాకా తినగలరు. అలాంటిది.. ఈ అమ్మాయి.. నిమిషంలోపే.. ఏకంగా 352 గ్రాముల చికెన్ నగ్గెట్స్‌ని లాగించేసి.. గిన్నిస్ రికార్డులో తన పేరు ఎక్కించేసుకుంది.

Also read : Guinness Record: గాల్లో ఉన్న హెలికాప్ట‌ర్‌కు వేలాడుతు పుల్అప్స్‌ తో గిన్నిస్ రికార్డు..ఒక్క నిమిషంలో ఎన్నో తెలుసా?!

ఇప్పటివరకు.. ఈ రికార్డ్ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన నేలా జిస్సర్ అనే యువతి పేరు మీద ఉండేది. ఆ అమ్మాయి.. 2020 నవంబర్‌లో 298 గ్రాముల చికెన్ నగ్గెట్స్‌ని.. నిమిషంలో తినేసింది. జిస్సర్ రికార్డును బద్దలు కొట్టేందుకే.. లియా ఈ సాహసం చేసింది. 352 గ్రాముల బరువున్న 19 నగ్గెట్స్‌ని.. వన్ మినిట్ లోపే తినేసింది. ఈ అమ్మాయి టాలెంట్ చికెన్ నగ్గెట్స్‌కి మాత్రమే పరిమితం కాదు. త‌న ఖాతాలో ఇంకా చాలా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులున్నాయ్. అవి కూడా తిండికి సంబంధించినవే. గతంలో.. 3 నిమిషాల్లోనే 775 గ్రాముల చికెన్ న‌గ్గెట్స్ తిని రికార్డ్ క్రియేట్ చేసింది. అలా.. ఇప్పటివరకు.. 27 రకాల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది.

లియా షట్కీవర్ సాధించిన గిన్నిస్ రికార్డుల్లో.. 3 నిమిషాల్లోపు ఎక్కువ జామ్ డోనట్స్ తినడం, 30 సెకన్లలో ఎక్కువ లాసాగ్నా తినడం, చాలా వేగంగా కీర దోసకాయను తినడం లాంటి రికార్డులున్నాయ్. ఇవన్నీ.. అంతగా ఆకట్టుకోకపోయేసరికి.. లీటర్ గ్రేవీని అత్యంత వేగంగా తాగి.. మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా నిమిషాల వ్యవధిలో ఎన్నో తినుబండారాలు తిని.. తన టాలెంట్‌ని.. ఈ గ్లోబ్‌కి చూపించింది. దీంతో.. లోకల్‌గానే కాదు.. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా.. స్పీడ్ ఈటర్ అనే పేరు తెచ్చుకుంది లియా. సోషల్ మీడియాలో.. ఈ అమ్మడి తిండికి సంబంధించిన వీడియోలు.. ఇప్పుడు వైరల్‌గా మారాయ్.

Also read :  Woman Guinness Record : తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు