ఫన్నీఫెలోస్ : చోరీ చేస్తూ పోలీసులకు ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయారు..

ఫన్నీఫెలోస్ : చోరీ చేస్తూ పోలీసులకు ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయారు..

UK ‘World’s unluckiest burglars’ : దొంగలు చోరీలకు వెళితే చక్కగా పని చక్కబెట్టుకుని నోరు మూసుకుని బైటకొచ్చేయాలి.అంతేకానీ పిచ్చిపిచ్చి వేషాసినా..ఓవర్ యాక్షన్లు చేసినా..అత్యుత్సాహానికి పోయినా..ఇదిగో ఈ దొంగల్లాగా వెరీ ఫన్నీగా పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు. ఓ ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి..పొరపాటున వాళ్లకు వాళ్లే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇంగ్లండ్ లో జరిగింది. ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైన దొంగలు ఎవరైనా ఉన్నారు అంటే అది వీళ్లే అని నెటిజన్లు ఆ తింగర దొంగలపై సెటైర్లు వేస్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లోకి గత బుధవారం (జనవరి 6,2021) ఇద్దరు దొంగలు చొరబడ్డారు. చక్కగా పనికానిచ్చారు. ఇంతో వారిలో ఓ దొంగ అనుకోకుండా ఆ ఇంట్లో ఉన్న ఓ ఫోన్ మీద కూర్చున్నాడు. అదికాస్త ‘999’ (పోలీసులకు చేసే కాల్ నంబర్)కు డయల్ అయ్యింది. ఆ ఫోన్ రింగ్ విన్న పోలీసులు లిఫ్ట్ చేశారు. కానీ అటువైపునుంచి ఎవరో ఇద్దరు వ్యక్తులు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకోవటం వినిపించింది.ఫోన్ చేసినవాళ్లు అంత రహస్యంగా మాట్లాడుకోవటం ఏంటీ అని అనుమానం వచ్చిన పోలీసులు శ్రద్ధగా విన్నారు.

అదేదో అనుమానాస్పదంగా ఉందని భావించి..వారికి వచ్చి ఫోన్ నంబర్ ను ట్రాక్ చేసి అక్కడికి చేరుకుసి ఆ ఇంటిని పరీక్షించి చూడగా..ఇద్దరు దొంగలు చోరీ చేస్తూ బిజీగా కనిపించారు. అంతే, పోలీసులు వాళ్లను లొంగిపోవాలని హెచ్చరించారు. దీంతో వాళ్లు ‘‘ఇంత సైలెంట్ గా చోరీ చేస్తుంటే ఈ విషయం పోలీసులకు ఎలా తెలిసిందబ్బా’’ అనుకుంటూ పరమానందయ్య శిష్యుల్లాగా ఆశ్చర్యపోతూ వేరే దారి లేక పోలీసులకు లొంగిపోయారు.

ఎక్కడైనా దొంగతనం జరిగితే.. బాధితులో లేదా తెలిసినవాళ్లో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు. కానీ ఇక్కడంతా సీన్ మొత్తం రివర్స్.. చోరీ చేస్తూ దొంగలే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయారు పాపం.అది వాళ్లు కావాలని చేయకపోయినా వాళ్ల బ్యాడ్ టైమ్ వల్ల అలా జరిగిపోయిందంతే..

ఈ ఫన్నీ ఘటన గురించి స్టాఫోర్డ్‌షైర్‌ పోలీస్ స్టేషన్‌లో చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జాన్ ఓవెన్ ఓ ఫన్నీ కేసు వివరాలను ట్వీట్టర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘హోం ఎలోన్’ సినిమాలోని ఓ పాపులర్ క్యారెక్టర్ సీన్‌ను ఇమేజ్‌తో.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర దొంగలు వీరేనంటు ఈ కేసు వివరాలను తెలిపారు.

ఆ దొంగల్లో ఒకరికి 49ఏళ్లు కాగా..మరొకరిది 42 అని చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న జాన్ ఓవెన్ తెలిపారు. ఈ ట్వీట్‌పై నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఓవెన్ చెప్పినట్లే.. ఆ దొంగలు నిజంగానే అన్‌లక్కీ ఫెలోస్ కదా!!