కూల్‌డ్రింక్ ఆర్డరిస్తే యూరిన్ బాటిల్..డెలివరీ సంస్థను ఏకి పారేసిన కష్టమర్

కూల్‌డ్రింక్ ఆర్డరిస్తే యూరిన్ బాటిల్..డెలివరీ సంస్థను ఏకి పారేసిన కష్టమర్

man gets bottle of urine in his food order : ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక్కోసారి ఏవోవో వస్తుంటాయి. కానీ..ఏకంగా కూల్ డ్రింక్ బాటిల్ ఆర్డర్ చేస్తే మూత్రం బాటిల్ వచ్చిన షాకింగ్ ఘటన గురించి విన్నారా? అంటూ కాస్త ఆలోచిస్తాం. కానీ నిజంగానే అది జరిగింది. దీంతో పాపం మాంచి ఆకలితో ఉన్న సదరు కష్టమర్ షాక్ అయ్యాడు. అసలు కడుపు ఆకలితో మండిపోతోందేమో..పైగా ఆ యూరిన్ బాటిల్ చూసేసరికి కడుపులో తిప్పేసినట్లుగా అయి సదరు ఫుడ్ డెలివరీ సంస్థకు ఫోన్ చేసి తెగ ఏకిపారేసాడు.

యూకేలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో రెండోసారి లాక్ డౌన్ అమలులోనే ఉంది. ఈక్రమంలో లండన్‌కు చెందిన ఓలివర్ మెక్ మనూస్ అనే యువకుడు హెలోఫ్రెష్‌యూకే అనే ఫుడ్ డెలివరీ సంస్థలో ఆర్డరిచ్చాడు. అనుకున్న సమయానికే డెలివరీ కూడా అయ్యింది. పాపం మాంచి ఆకలితో ఉన్న ఓలివర్ భోజనం లాగించేద్దామని ప్యాకెట్‌ను గబగబా విప్పాడు. అంతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఒలివర్ ఫుడ్‌తో ఓ కూల్‌డ్రింక్ బాటిల్‌ కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చినట్లుగానే ఫుడ్ తో పాటు ఓ బాటిల్ కూడా వచ్చింది. అది కూల్ డ్రింగ్ బాటిలే కాదు దాంట్లో ఉన్నది మాత్రం కూల్ డ్రింక్ కాదు. మరి అదేంటాని..చూసి షాకయ్యాడు. బాటిల్ లో ఉన్నది కోకాకోలా కాదు ఏదో కలర్ లాగా ఉంది. అదేంటాని బాటిల్ ఓపెన్ చేసి చూశాడు. కూల్‌డ్రింక్ కాదు.. మనిషి మూత్రం..!

మరోసారి దాన్ని పరిశీలించగా అది మనిషి మూత్రం అని కన్ఫార్మ్ చేసుకున్నాడు. అంతే తినే ఆహారంలో యూరిన్ బాటిల్ చూడగానే ఓలివర్‌కు కడుపులో దేవినట్లు అయ్యింది. ఆకలి సంగతి మరచిపోయాడు. వెంటనే కోపం తారాస్థాయికి చేరింది. ఒళ్లు మండిపోగా వెంటనే ఫోన్ అందుకున్నాడు. ఫుడ్ ప్యాకెట్ పక్కన పారేసి..సదరు ఫుడ్ డెలివరీ సంస్థకు ఫోన్ చేసి ఏకిపారేశాడు.

అసలే ఆకలి..పైగా ఫుడ్ తో పాటు వచ్చిన యూరిన్ బాటిల్ ను చూసేసరికి ఆగ్రహం పట్టలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ సదరు ఫుడ్ డెలివరీ సంస్థను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపారేశాడు. ఆ తరువాత ఫుడ్‌తో పాటు డెలివరీ అయిన యూరిన్ బాటిల్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి.. సదరు ఫుడ్ డెలివరీ సంస్థను ఏకిపారేశాడు. మీ అడ్రస్ చెప్తే ఆ యూరిన్ బాటిల్‌ను పంపిస్తానని..దాన్ని తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఓలివర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారడంతో ఏం జరిగిందో సవివరంగా చెప్పమని నెటిజన్లు ఒకటే అడుగుతుండటంతో ఇరిటేషన్ కు గురైన ఓలివర్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. అయితే ఈ విషయం హెలోఫ్రెష్‌యూకే ఫుడ్ డెలివరీ సంస్థకు తెలియడంతో ట్విటర్ ద్వారా ఓలివర్‌కు క్షమాపణలు చెప్పింది. జరిగిన అసౌకర్యానికి ఎలా క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదని తెలిపింది. దయచేసి క్షమించండి ఇది ఎలా జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుంటామంటూ చెప్పుకొచ్చింది.