Russia Troops Killed : యుద్ధంలో 16,100 మంది రష్యన్ సైనికులు మృతి-యుక్రెయిన్ రక్షణ శాఖ

రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 16వేల 100 మంది రష్యా సైనికులను..(Russia Troops Killed)

Russia Troops Killed : యుద్ధంలో 16,100 మంది రష్యన్ సైనికులు మృతి-యుక్రెయిన్ రక్షణ శాఖ

Russian Troops Killed (2)

Russia Troops Killed : రష్యా-యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులుగా యుక్రెయిన్‌పై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. యుక్రెయిన్‌లో రష్యా సేనలు భారీ విధ్వంసమే సృష్టించాయి. ఈ దాడుల్లో యుక్రెయిన్ సైన్యంతో పాటు సాధారణ ప్రజలూ అనేకమంది చనిపోయారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ బలగాలు రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ యుద్ధంలో చాలామంది రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు సైతం చేసింది యుక్రెయిన్ ఆర్మీ.(Russia Troops Killed)

Russia ukraine war : రష్యాతో పోరాటానికి రోజు 1000 ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికాకు జెలెన్ స్కీ డిమాండ్

తాజాగా యుక్రెయిన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నాలుగు వారాలకుపైగా తమ దేశంలో రష్యా కొనసాగిస్తున్న దండయాత్రను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు తెలిపింది. రష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 16వేల 100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు యుక్రెయిన్‌ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 561 యుద్ధ ట్యాంకులు, 1625 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లు, 53 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 5 నౌకలు, 49 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.

నెలరోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. కొన్నిరోజులుగా దాడుల్లో తీవ్రత పెంచింది రష్యా. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా సేనలు ఉపయోగిస్తున్నాయి. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్.

యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకుని ప్రభుత్వాన్ని మార్చవచ్చని పుతిన్ భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు 4 వారాలుగా భీకర యద్ధం కొనసాగుతోంది. అయితే, పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నాయి. అంతేకాదు, ఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో రష్యా తన సైనికులను కోల్పోతోంది.(Russia Troops Killed)

అణ్వాయుధాల ప్రయోగం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. రష్యా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని రష్యా స్పష్టం చేసింది. యుక్రెయిన్‌ తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో మాస్కో అణ్వాయుధాల్ని వినియోగిస్తుందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో పుతిన్‌ సర్కార్ స్పందించింది. రష్యా మనుగడకు ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది.

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

మరోవైపు కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌ వంటి నగరాల్లో క్షిపణులు, బాంబు దాడులతో రష్యా బలగాలు విజృంభిస్తున్నాయి. మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై జరిపిన బాంబు దాడిలో 300 మంది మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన బాంబు దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని అధికారులు తెలిపినట్టు వార్తలు వచ్చాయి.