Ukraine- Russia Crisis : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్స్ బంగారం ధర 1888 డాలర్లు, వెండి 23.94 డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా... భిన్నంగా పరిస్థితులున్నాయి. రష్యా

Ukraine- Russia Crisis : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rate

Ukraine- Russia Crisis Gold Rates : బంగారం కొనాలని అనుకుంటున్న వారికి ఇదొక శుభవార్తే. గోల్డ్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో తెలియడం లేదు. దీంతో బంగారం ధరలు ఇక దిగి రావని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర గరిష్టంగా 1929 డాలర్లకు, వెండి 24.8 డాలర్లకు చేరింది.

Read More : Russia-Ukraine war: పైన బాంబుల మోత..కీవ్ మెట్రో అండ‌ర్‌గ్రౌండ్‌ లో పండంటి పాపకు జ‌న్మ‌నిన మ‌హిళ‌

శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్స్ బంగారం ధర 1888 డాలర్లు, వెండి 23.94 డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా… భిన్నంగా పరిస్థితులున్నాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలకే పరిమితం అవుతున్నందున ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ లో గురువారం రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 53 వేల 100 ఉండగా వెండి కిలో రూ. 68 వేల 600గా ఉంది. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్చత రూ. 1873 తగ్గి రూ. 50 వేల 667 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ. 2 వేల 975 దిగివచ్చి రూ. 65 వేల 174 వద్దకు దిగివచ్చింది. మరోవైపు… యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే సూచనలు లేకపోవడంతో ప్రపంచ మార్కెట్లు కొంత కోలుకున్నాయి. చమురు ధరలు కూడా తగ్గాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.