Joe Biden: యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ గెలవలేదు.. పుతిన్ యుద్ధాన్ని ఆపగలడు: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్‌కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా.. యుక్రెయిన్ ఇంకా బలంగానే ఉంది.

Joe Biden: యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ గెలవలేదు.. పుతిన్ యుద్ధాన్ని ఆపగలడు: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Joe Biden: యుద్ధంలో యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఏడాది కాలంగా యుక్రెయిన్‌ స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిలబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం పోలాండ్‌లోని, వార్సాలో పర్యటించిన జో బైడెన్ రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

పాశ్చాత్య దేశాల మద్దతు యుక్రెయిన్‌కు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదు. ఏడాదిక్రితం ప్రపంచమంతా యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు యుక్రెయిన్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా చెప్తున్నా.. యుక్రెయిన్ ఇంకా బలంగానే ఉంది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉంది. ఖేర్సన్ నుంచి ఖారివ్ వరకు యుక్రెయిన్‌ వీరులు తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం అవసరమైంది కాదు. ఇదో విషాదం. దీన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ముగించగలడు.

Visakha Beach Clean : మందుబాబుల కిక్కు దించిన విశాఖ కోర్టు.. ఎలాంటి శిక్ష విధించిందంటే

రష్యా దాడి వల్ల యుక్రెయిన్‌ ఒక్కటే కాదు.. ప్రపంచం మొత్తం సమస్యను ఎదుర్కొంది. ముఖ్యంగా యూరప్, అమెరికా, నాటో దేశాలు పరీక్షను ఎదుర్కొన్నాయి. ప్రజాస్వామ్య దేశాలన్నీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు యుక్రెయిన్‌ యుద్ధం విషయంలో అమెరికా, యూరప్ దేశాలపై పుతిన్ విమర్శలు చేశాయి. ఆ దేశాలు రష్యాను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దీనిపై జో బైడెన్ స్పందించారు. ‘‘నేను మరోసారి ఈ విషయంలో స్పష్టతనిస్తున్నా. అమెరికా లేదా యూరప్ దేశాలు రష్యాను నియంత్రించాలని లేదా నాశనం చేయాలని కోరుకోవడం లేదు. పుతిన్ చెప్పినట్లు పశ్చిమ దేశాలకు రష్యాపై దాడి చేసే ఉద్దేశం లేదు’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.