బ్రేకప్ కు టాటా : కలిసి ఉంటేనే కలదు సుఖం

కలహాలతో విడిపోదామనుకున్నారు.. బ్రేకప్‌ చెప్పేముందు తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది...

బ్రేకప్ కు టాటా : కలిసి ఉంటేనే కలదు సుఖం

Breakup

Ukrainian couple : కలహాలతో విడిపోదామనుకున్నారు.. బ్రేకప్‌ చెప్పేముందు తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఉక్రేయిన్‌కి చెందిన అలెగ్జాండర్‌ కుడ్లే సేల్స్‌మాన్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య విక్టోరియా బ్యూటీషియన్‌. కొన్నేళ్లుగా వాళ్లు ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నా.. తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు బ్రేకప్‌ చెప్పేద్దాం అనిపించేంతంగా కోపం వచ్చేది. అయితే బ్రేకప్‌ చెప్పే ముందు కొన్ని రోజుల పాటు ఇద్దరు కలిసి ఉండేలా ఓ కొత్తరకం ప్లాన్‌ వేశారు.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఇద్దరు చేతులకు బేడీలు వేసుకున్నారు. రెండు నెలల పాటు ఇద్దరు ఎటు వెళ్లినా కలిసే వెళ్లాలి, కలిసే పని చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఇద్దరు సర్థుకుపోతూ అన్ని పనులు కలిసే చేసుకుంటూ జీవించడం మొదలు పెట్టారు. తమ రోజు వారి దినచర్యను వీడియో, ఫోటోలు తీస్తూ డాక్యుమెంటరీ తయారు చేయడం మొదలు పెట్టారు. పొద్దున బాత్రూమ్‌ వెళ్లడం మొదలు వంటపని, ఇంటి పని, సూపర్‌ మార్కెట్‌కి వెళ్లడం, ఆఫీస్‌ పనులు అన్ని బేడీలతో కలిసి చేశారు.

నెల రోజులు గడిచే సరికి ఇద్దరు మనుసులు మరోసారి కలిసిపోయాయి. బ్రేకప్‌ చెప్పాలనే ఆలోచన హుష్‌కాకి అయ్యింది. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా.. ప్రతీ క్షణం మన భాగస్వామితో మనతోనే ఉండటం వల్ల ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. దీంతో కోపం, అసహనం తగ్గిపోయింది. మునుపటి కంటే ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగిందని చెబుతున్నారు విక్టోరియా అలెగ్జాండర్‌లు. వీరిద్దరి బేడీల వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.