UK New Graduate Route : భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకేలో రెండేళ్లు పనిచేయొచ్చు..!

భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకేలోని భారతీయ విద్యార్థులకు బ్రిటన్ మంచి అవకాశం కల్పిస్తోంది. యూకేలో తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే కొంతకాలం ఉండేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.

UK New Graduate Route : భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకేలో రెండేళ్లు పనిచేయొచ్చు..!

Uk's New Graduate Route Opens For Applications; Indian Students To Benefit

UK New Graduate Route : భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకేలోని భారతీయ విద్యార్థులకు బ్రిటన్ మంచి అవకాశం కల్పిస్తోంది. యూకేలో తమ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే కొంతకాలం ఉండేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. చదువుల అనంతరం భారతీయ విద్యార్థులు రెండేళ్ల పాటు పనిచేసేందుకు అవకాశం కల్పిస్తోంది. కొత్త గ్రాడ్యుయేట్ ఇమ్మిగ్రేషన్ రూట్‌ (New Graduate Immigration Route) అనే ఈ-వీసా విధానాన్ని గురువారం (జూలై 1)న యూకే హోం ప్రీతి పటేల్ ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారా విదేశీ విద్యార్థులు యూకేలో చదువు అనంతరం రెండేళ్ల పాటు పనిచేయొచ్చు. అలాగే తమ స్కిల్ లెవల్ బట్టి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

గ్రాడ్యుయేల్ రూట్ విధానం ద్వారా అప్లికేషన్లను తొలిసారి డిజిటల్ రూపంలో ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ ద్వారా అప్లయ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అర్హులైన విద్యార్థులకు ఈ-వీసాలకు జారీ చేస్తారు. మొబైల్‌లో డిజిటల్ రూపంలో ఈ-వీసా ఉండటం ద్వారా ఎలాంటి సందర్భాల్లోనే తమ హక్కులను నిరూపించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూ రూట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు. ఇంతకు ముందు దరఖాస్తుదారులు UK వీసా, పౌరసత్వ దరఖాస్తు సర్వీసును విజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా తమ బయోమెట్రిక్‌లను తిరిగి సమర్పించాల్సి ఉంటుంది.

యాప్ వినియోగించుకోలేని విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. కానీ, వీరు యూకే వీసా, సిటిజన్ షిప్ అప్లికేషన్ సర్వీసును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా భారత్ నుంచి వచ్చే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాదిలో 56వేలకు పైగా భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసాను పొందారు. అంతకుముందు ఏడాది పోలిస్తే.. 13శాతం పెరిగింది. ఈసారి కూడా బ్రిటన్ లో చదువుకునేందుకు విద్యార్థులు పెద్దసంఖ్యలో అప్లయ్ చేస్తారని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థుల అప్లకేషన్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం gov.uk ను సంప్రదించవచ్చు. ఈ ఏడాది చేరాలనుకునేవారు సెప్టెంబర్ 27లోగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.