వందల పక్షుల ప్రాణం తీసిన ఎల్ఈడీ డిస్‌ప్లే

వందల పక్షుల ప్రాణం తీసిన ఎల్ఈడీ డిస్‌ప్లే

Dead Birds: వందల్లో పక్షులు న్యూఇయర్ ఈవెనింగ్ ప్రాణాలు పోగొట్టుకున్నాయి. జంతువుల హక్కు సంఘాలు ఈ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పోరాడుతున్నాయి. రోమ్ మెయిన్ ట్రైన్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లోరికార్డు అయింది. డజన్ల కొద్దీ పక్షులు.. చెట్ల ఆకులు రాలినట్లు నేలమీద పడిపోయాయి.

ఈ వీడియోలో చూస్తూ ఓ వ్యక్తి.. ‘మానవత్వం ఎక్కడికి పోయింది. నిజంగా హార్ట్ బ్రేకింగ్ విషయం. వందల్లో పక్షులు చచ్చిపడి ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు’ అంటూ కామెంట్లు చేశాడు. మానవత్వం ఎక్కడికి పోయింది. వీటి మరణాలు వెనుక కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్(ఓఐపీఏ) ఇది ఎల్ఈడీ డిస్‌ప్లేలో పెద్ద సౌండ్‌తో ఫైర్ క్రాకర్స్, ఫైర్ వర్క్స్ పేల్చడమే అని చెబుతున్నాయి.

కొత్త సంవత్సర సంబరాల్లో భాగంగా పెద్ద ఎల్ఈడీ డిస్‌ప్లేలలో బాంబులు పేల్చినట్లుగా కనిపిస్తూ.. శబ్దాలు వినపడటంతో అలా జరిగిందని అంటున్నారు.

అవన్నీ భయం కారణంగానే చనిపోయాయి. ఒకేసారి పైకి ఎగరడంతో ఒకటికొకటి ఢీకొట్టుకోవడంతో ప్రాణాలు కోల్పోయాయి. మరికొన్ని ఎలక్ట్రిక్ పవర్ లైన్స్ ను, కిటికీ అద్దాలను ఢీ కొన్నాయి. ఒకవేళ వాటికి గుండెనొప్పి వచ్చి కూడా చనిపోయి ఉండొచ్చు అని ఆర్గనైజేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఏటా జరిగే ఫైర్ వర్క్స్ డిస్‌ప్లే కారణంగా క్రూర, సాధారణ జంతువులకు ప్రాణ హాని జరుగుతుందని అంటున్నారు. రోమ్ నగరంలో పర్సనల్ ఫైర్ వర్క్స్ డిస్ ప్లేకు నిషేదం ప్రకటించినా లెక్కచేయడం లేదు. దాంతో వైరస్ నిషేదాజ్ఞల మేరకు 10తర్వాత కర్ఫ్యూ కూడా విధించింది రోమ్.