Long March-5B Rocket : పేలిన చైనా రాకెట్.. ఏ క్షణంలోనైనా భూమిపైకి రావొచ్చు.. జనావాసాల్లో ఎక్కడైనా పడొచ్చు జాగ్రత్త అంటున్న నిపుణులు

చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్టులో భాగంగా డ్రాగన్ దేశం లాంగ్ మార్చ్ -5బి రాకెట్‌ను ప్రయోగించింది. సరికొత్త పర్మినెంట్ స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ రాకెట్ ను అంతరిక్షంలో పంపింది.

Long March-5B Rocket : పేలిన చైనా రాకెట్.. ఏ క్షణంలోనైనా భూమిపైకి రావొచ్చు.. జనావాసాల్లో ఎక్కడైనా పడొచ్చు జాగ్రత్త అంటున్న నిపుణులు

Uncontrolled Chinese Rocket Falling To Earth And Nobody Knows Where It Could Land

Chinese Long March 5B rocket falling to Earth : చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్టులో భాగంగా డ్రాగన్ దేశం లాంగ్ మార్చ్ -5బి రాకెట్‌ను ప్రయోగించింది. సరికొత్త పర్మినెంట్ స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ రాకెట్ ను అంతరిక్షంలో పంపింది. టియాన్ హే మాడ్యుల్ ను వెన్చాంగ్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. చైనా అంతరిక్ష కేంద్రం టియాన్హే ప్రధాన మాడ్యూల్‌ను కక్ష్యలోకి విజయవంతంగా పంపిణీ చేసింది. భూమికిపైకి తిరిగివచ్చే క్రమంలో ఆ రాకెట్ అంతరిక్షంలో పేలిపోయింది. 21 టన్నుల చైనీస్ రాకెట్ అనియంత్రిత మార్గంలో భూమిపైకి వస్తుందని, జనాభా ఉన్న ప్రాంతాల్లోనే దిగొచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, 30 మీటర్ల పొడవైన రాకెట్ కూడా కక్ష్యకు చేరుకుంది.

China Rocket

రాబోయే కొద్ది రోజుల్లో అనియంత్రిత మార్గంలో తిరిగి భూమికి వస్తుందని నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా భూమిపైకి దూసుకురావొచ్చు.. జనావాస ప్రదేశంలో దిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. లాంగ్ మార్చి 5బి కోర్ స్టేజ్ ఫాల్కన్ 9 రెండవ దశ కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉంటుందని స్పేస్‌ఫ్లైట్ పరిశీలకుడు జోనాథన్ అభిప్రాయపడ్డారు. ఈ రాకెట్.. ప్రతి 90 నిమిషాలకు భూమి చుట్టూ తిరుగుతుందని, న్యూయార్క్, మాడ్రిడ్, బీజింగ్ లకు ఉత్తరాన వెళ్తుందని, చిలీ, వెల్లింగ్టన్, న్యూజిలాండ్ వరకు దక్షిణాన వెళ్లొచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

Rocket

ఈ క్రమంలోనే రాకెట్ జనావాస ప్రాంతాలలోకి ప్రవేశించవచ్చనే ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఈ రాకెట్ పొడవు సుమారు 100 అడుగుల పొడవు 16 అడుగుల వెడల్పుతో ఉంటుంది. కక్ష్య నుంచి పడిపోయిన తర్వాత, అది భూమి వాతావరణంలోకి రాగానే కాలిపోయే అవకాశం ఉందంటున్నారు. కాలిపోయిన రాకెట్ శిధిలాల ముక్కలు భూ వాతావరణంలో ఎక్కడైనా పడొచ్చునని అంటున్నారు. కచ్చితంగా ఎక్కడ పడుతుందో తెలియదని చెబుతున్నారు.

Roc

రాకెట్ శిధిలాలు సముద్రంలో పడే అవకాశం ఉందని, కానీ, అందులో కొన్ని కొన్ని నివాస ప్రాంతాలలో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పేలిన రాకెట్ శకలాల సంఖ్యను అంచనా వేయడం కష్టమని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సేఫ్టీ ప్రోగ్రామ్ ఆఫీస్ హెడ్ హోల్గర్ క్రాగ్ అంటున్నారు. మరోవైపు.. ఇలాంటి మాడ్యూల్స్ ప్రారంభించిన తర్వాత 2022 చివరి నాటికి చైనా తన శాశ్వత అంతరిక్ష కేంద్రం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.