United Kingdom PM race: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీలో వెనకబడిపోతున్న భారత సంత‌తి నేత రిషి సునక్

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ కు వెనకబడి పోతున్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వి కోసం జరుగుతోన్న ఎన్నికల్లో రిషి సునక్, లిజ్ ట్రస్ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. రిషి సునక్ కంటే లిజ్ ట్రస్ కే అత్యధిక మంది టోరీ సభ్యులు మద్దతు తెలిపే అవకాశం ఉందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్‌ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా 961 మంది అభిప్రాయాలు తీసుకుంది. వారిలో 60 శాతం మంది లిజ్ ట్రస్‌కు మద్దతు తెలిపారు.

United Kingdom PM race: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీలో వెనకబడిపోతున్న భారత సంత‌తి నేత రిషి సునక్

Liz Truss Poised To Become Next PM

United Kingdom PM race: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి పోటీలో తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ వెనకబడి పోతున్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వి కోసం జరుగుతోన్న ఎన్నికల్లో రిషి సునక్, లిజ్ ట్రస్ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. రిషి సునక్ కంటే లిజ్ ట్రస్ కే అత్యధిక మంది టోరీ సభ్యులు మద్దతు తెలిపే అవకాశం ఉందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్‌ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా 961 మంది అభిప్రాయాలు తీసుకుంది. వారిలో 60 శాతం మంది లిజ్ ట్రస్‌కు మద్దతు తెలిపారు.

సునాక్‌కు 28 శాతం మంది మద్దతు పలికారు. మరో 9 శాతం మంది ఏ నిర్ణయాన్నీ చెప్పలేదు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికైనవారే ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారన్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం కన్జర్వేటివ్‌ పార్టీ జరిపిన సర్వేలోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. అప్పట్లో 58 శాతం మంది లిజ్ ట్రస్‌కు మద్దతు తెలిపగా, రిషి సునాక్‌కు 26 శాతం మంది మద్దతు పలికారు. మరో 12 శాతం మంది ఏ నిర్ణయాన్నీ చెప్పలేదు. కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికైనవారు ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారు. మొదట రిషి సునక్ కు చాలా మంది మద్దతు తెలపగా, ఇప్పుడు లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నారు.

Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు