United Kingdom: వేడికి చాక్లెట్లలా క‌రిగిపోయి.. కాళ్ళకు అంటుకుంటున్న రోడ్లు

ఐసు ముక్క‌లు క‌రిగిపోతాయి.. చాక్లెట్లూ క‌రిగిపోతాయి.. అయితే, రోడ్లు కూడా మంచు ముక్క‌ల్లా, చాక్లెట్లలా క‌రిగిపోవ‌డం ఎప్పుడైనా చూశారా? యూకేలోని ప‌లు ప్రాంతాల్లో ఇదే జ‌రుగుతోంది. అంత‌గా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోయాయి. రోడ్డుపై కాలు పెరిగితే బంకలా డాంబర్ అతుక్కుపోతోంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు వాపోతున్నారు. నీటిలో వాహ‌నంపై వెళ్తే ఎలాంటి చ‌ప్పుడు వ‌స్తుందో అలాంటి చ‌ప్పుడు ఈ రోడ్ల‌పై న‌డుస్తుంటే వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

United Kingdom: వేడికి చాక్లెట్లలా క‌రిగిపోయి.. కాళ్ళకు అంటుకుంటున్న రోడ్లు

Roads

United Kingdom: ఐసు ముక్క‌లు క‌రిగిపోతాయి.. చాక్లెట్లు కూడా క‌రిగిపోతాయి.. అయితే, రోడ్లు కూడా మంచు ముక్క‌ల్లా, చాక్లెట్లలా క‌రిగిపోవ‌డం ఎప్పుడైనా చూశారా? యూకేలోని ప‌లు ప్రాంతాల్లో ఇదే జ‌రుగుతోంది. అంత‌గా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోయాయి. రోడ్డుపై కాలు పెరిగితే బంకలా డాంబర్ అతుక్కుపోతోంద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు వాపోతున్నారు. నీటిలో వాహ‌నంపై వెళ్తే ఎలాంటి చ‌ప్పుడు వ‌స్తుందో అలాంటి చ‌ప్పుడు ఈ రోడ్ల‌పై న‌డుస్తుంటే వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

భ‌విష్య‌త్తులో భూతాపం మాన‌వ జీవ‌నానికి ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుందో యూకేలోని ప‌రిస్థితుల వ‌ల్ల అర్థం చేసుకోవ‌చ్చు. బ్రిటన్‌లో ఎన్న‌డూ లేనంత‌గా అధిక ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మూడు రోజుల క్రితం గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్‌లో 34.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. అక్క‌డ ఇంత‌గా ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. 2019 జులైలో ఆ ప్రాంతంలో 33.9 డిగ్రీల‌ సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

రోడ్డుపై ప‌డిన వేడి 50 డిగ్రీల స్థాయికి చేరి రోడ్డును క‌రిగిస్తోంది. దీంతో ఆ రోడ్ల‌పై వాహ‌నాలు తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్పడుతోంది. కాగా, బ్రిట‌న్‌లోని ఇతర ప‌లు ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఇటీవ‌లే సౌత్‌ లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయానికి సమీపంలో చార్ల్‌వుడ్‌ సర్రేలో రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

YouTube: అబార్ష‌న్లు చేసే ప్ర‌క్రియ‌పై త‌ప్పుడు స‌మాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చ‌ర్య‌లు