Sex Mountain: “శృంగార పర్వతం” గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఈ భూమి మీద ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతులు, ఆచారాలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం కూడా ఇటువంటి వాటిలో ఒకటి. దీనిని శృంగార పర్వతం (సెక్స్ మౌంటెన్) అని కూడా పిలుస్తారు. ఈ పర్వతంపై ఓ దేవాలయం ఉంది. ఇక్కడ పండుగ వేళల్లో భక్తులు వస్తారు.

Sex Mountain: “శృంగార పర్వతం” గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Sex Mountain

Sex Mountain: ఈ భూమి మీద ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతులు, ఆచారాలు ఉంటాయి. వీటిలో కొన్ని ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతం కూడా ఇటువంటి వాటిలో ఒకటి. దీనిని శృంగార పర్వతం (సెక్స్ మౌంటెన్) అని కూడా పిలుస్తారు. ఈ పర్వతంపై ఓ దేవాలయం ఉంది. ఇక్కడ పండుగ వేళల్లో భక్తులు వస్తారు.

ఈ పర్వతాన్ని కాలినడకడతో అధిరోహించి దేవాలయానికి వస్తారు భక్తులు. ఈ దేవాలయం జావా రాజు కుమారుడికి అతని సవతి తల్లికి గుర్తుగా నిర్మించారు. జావా రాజు కుమారుడు, అతడి సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వారిని రాజ్యం నుంచి వెలివేస్తాడు రాజు. వారిద్దరూ కలిసి కేముకస్ పర్వతం మీదకు వెళ్తారు. అక్కడ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో సైనికులు వారిని చంపి అక్కడే పూడ్చుతారు. ఈ విషయం స్థానిక ప్రజలకు తెలియడంతో వారు అక్కడ దేవాలయం నిర్మించి వారికీ పూజలు చేస్తున్నారు.

ఈ శృంగార పర్వతంపై ఏడాదికి 35 రోజుల పాటు పండుగ చేస్తారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వారు.. పరిచయం లేని వ్యక్తులతో శృంగారం చెయ్యాల్సి ఉంటుంది. ఆలా ఏడూ సార్లు ఒకే వ్యక్తితో శృంగారం చేస్తే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అయితే పెళ్లి అయినవారు కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటారు. ఇలా చేసుకున్న సమయంలో ఆ వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఇక్కడ జరుతుంటాయట.

ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు కొందరు తిరస్కరిస్తున్నారట. పెళ్ళైన వారు భర్తలను వదిలేసి వెళ్లడమే వీరి తిరస్కరణకు కారణం. ఈ ఆచారం వలన చాలామంది పెళ్ళైన మహిళలు ఇతరుల ప్రేమలో పడి భర్తను వదిలేసి వెళ్లిపోయారట. దీంతో దీనిని నిషేదించాలని కొందరు కోరుతున్నారు.