పెళ్లి కాని మగాళ్లకే కరోనా రిస్క్ ఎక్కువట!!

పెళ్లి కాని మగాళ్లకే కరోనా రిస్క్ ఎక్కువట!!

Covid Risk: తక్కువ ఆదాయం, అంతంత మాత్రమే చదువు, పెళ్లి కాని వాళ్లే కరోనా రిస్క్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారట. దిగువ, మధ్య స్థాయి ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ బాధితులు ఉన్నారు. అంటే పెళ్లి కాని మగాళ్లలోనే కరోనా రిస్క్ ఎక్కువగా ఉంది.

‘కొత్త రీసెర్చ్ ప్రకారం.. పెళ్లి కాని వారే COVID-19తో చనిపోయే ప్రమాదం ఉందట. దీంతో పాటు, తక్కువ ఆదాయం, తక్కువ స్థాయి విద్య, తక్కువ లేదా మధ్య-ఆదాయ దేశాలలో జన్మించిన వ్యక్తి ఈ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ యూనివర్సిటీ రీసెర్చర్లు హెచ్చరించారు.



20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. COVID-19 గురించి వారి దగ్గర ఉన్న డేటాను బట్టే చూపించగలుగుతున్నామని రీసెర్చర్ స్వెన్ డ్రెఫాల్ చెప్పారు.

దీనికి రీజన్స్ అన్ని కొవిడ్ -19తో చనిపోయే ప్రమాదంతోనే లింక్ అయి ఉన్నాయని ఆయన అన్నారు. ఈ పరిశోధనలో ఒంటరిగా ఉండే వారికి తక్కువ ప్రొటెక్షన్‌తో ఉంటారని దానిని పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. పెళ్లి కాని వారితో పోలిస్తే పెళ్లైన వారే ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారు. కరోనా సోకినా మరణం ముప్పు కూడా పెళ్లైన వారిలో తక్కువగా ఉంటుందట.

ఓ మీడియా ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. పెళ్లికాని పురుషులు, మహిళలల్లో COVID-19 నుంచి మరణించినవారి కంటే 1.5-2 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని వెల్లడైంది. స్త్రీల కంటే COVID-19 కారణంగా చనిపోయే ప్రమాదం పురుషులలో2 రెట్లు ఎక్కువ అని రీసెర్చ్ తెలిపింది.