Unwell Man Orders Food : చివరి నిమిషంలో ఆర్డర్..రెస్టారెంట్ మానవత్వం, నెటిజన్ల సలామ్

నోట్ చదివిన రెస్టారెంట్ సిబ్బంది మానవత్వం ప్రదర్శించారు. కస్టమర్ కు ఉచితంగా ఫుడ్ పంపిచచడంతో పాటు..ఓ నోట్ ను పంపించారు.

Unwell Man Orders Food : చివరి నిమిషంలో ఆర్డర్..రెస్టారెంట్ మానవత్వం, నెటిజన్ల సలామ్

Food

Unwell Man Orders Food : మానవత్వం ఇంకా బతికే ఉందని పలు ఘటనలు చూపిస్తుంటాయ. ప్రాణాపాయంలో ఉన్న వారిని చివరి నిమిషంలో ఆసుపత్రికి తరలించి..వారి ప్రాణాలను నిలబెట్టడం, ఆకలితో ఉన్న వారికి ఏదో ఒక ఆహారం అందచేయడం..లాంటివి చూస్తుంటాం. అయితే..ఇవి ఎప్పుడు బయటపడుతుంటాయో తెలియదు. ఓ వ్యక్తికి చివరి నిమిషంలో ఆన్ లైన్ తనకు ఫుడ్ కావాలని ఆర్డర్ చేయడంతో..అందరి రెస్టారెంట్ లాగా సేల్స్ క్లోజ్ అయ్యాయని చెప్పలేదు. అతనిపై మానవత్వం చూపించింది. అతను ఆర్డర్ చేసినట్లుగానే..ఇంటికి ఆహారాన్ని పంపించింది. ఆ రెస్టారెంట్ కు సంబంధించిన ఉద్యోగి…సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ రెస్టారెంట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

Read More : Nitish Kumar : బీహార్ సీఎంపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఆరోపణలు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి..తనకు ఫుడ్ కావాలంటూ..రెస్టారెంట్ కు ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. అయితే..14 నిమిషాల్లో ఆ రెస్టారెంట్ క్లోజ్ కానుంది. ఆర్డర్ తో పాటు..ఓ నోట్ ను కూడా ఆ రెస్టారెంట్ కు పంపించాడు. చివరి నిమిషంలో ఆర్డర్ చేస్తున్నందుకు క్షమించాలని అతను పేర్కొన్నాడు. తనకు ఆరోగ్యం బాగా లేదని…ఇప్పడే నిద్ర లేచినట్లు..బాగా ఆకలిగా ఉందని అందుకే ఇప్పుడే ఆర్డర్ చేయడం జరిగిందని వివరించాడు. తన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే..రెస్టారెంట్ క్లోజ్ అయ్యిందని భావిస్తానని తెలిపారు.

Read More : Omicron Quarantine : ఒమిక్రాన్ భయం.. వారికి 7 రోజుల క్వారంటైన్ మస్ట్.. కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ నోట్ చదివిన రెస్టారెంట్ సిబ్బంది మానవత్వం ప్రదర్శించారు. కస్టమర్ కు ఉచితంగా ఫుడ్ పంపిచచడంతో పాటు..ఓ నోట్ ను పంపించారు. లేట్ గా ఆర్డర్ చేసినందుకు బాధ పడకండి..మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్డర్ తో పాటు..బ్రెడ్ ను పంపిస్తున్నట్లు వెల్లడించింది. తన ఆర్డర్ తో పాటు.. గార్లిక్ బ్రెడ్ ను ఫ్రీగా పంపించడంతో…అతను సంతోషించి….రెస్టారెంట్ కు 5స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ ఉద్యోగి…సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది తెగ వైరల్ గా మారింది. రెస్టారెంట్ మానవత్వం చూపించిందంటూ…హాట్సాఫ్ చేస్తున్నారు.