‘Tactical Bra’ for Women Jawans : మహిళా జవాన్ల కోసం ప్రత్యేక లో దుస్తులు రూపొందిస్తున్న అమెరికా ఆర్మీ

మహిళా జవాన్ల విషయంలో అమెరికా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా జవాన్ల కోసం ప్రత్యేక లో దుస్తులు (బ్రా) రూపొందించాలని నిర్ణయించింది. దీని కోసం నాలుగు రకాల మోడల్స్ ను పరిశీలించింది. మహిళా జవాన్ల భద్రతే కాకుండా వారు సౌకర్యవంతంగా పనిచేయటానికి ఉపయోగపడేలా ప్రత్యేక బ్రాలను రూపొందిస్తోంది.

‘Tactical Bra’ for Women Jawans : మహిళా జవాన్ల కోసం ప్రత్యేక లో దుస్తులు రూపొందిస్తున్న అమెరికా ఆర్మీ

US army developing 'tactical bra' for female soldiers

Tactical Bra for US Women Jawans : మహిళా జవాన్ల విషయంలో అమెరికా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా జవాన్ల కోసం ప్రత్యేక లో దుస్తులు (బ్రా) రూపొందించాలని నిర్ణయించింది. దీని కోసం నాలుగు రకాల మోడల్స్ ను పరిశీలించింది. మహిళా జవాన్ల భద్రతే కాకుండా వారు సౌకర్యవంతంగా పనిచేయటానికి ఉపయోగపడేలా ప్రత్యేక బ్రాలను రూపొందిస్తోంది.

ప్రత్యేక బ్రాను రూపొందించే ముందు ఆర్మీలో సేవలందిస్తున్న మహిళా జవాన్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది. మహిళా జవాన్లు క్షేత్ర స్థాయిలో పనిచేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు?ఎటువంటి సమస్యలు వస్తున్నాయి?ముఖ్యంగా యుద్ధ సన్నాహాలను ఎదుర్కునే ఇబ్బందులకు చెక్‌ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.

ఈ అంశం గురించి క్లాతింగ్ డిజైనర్‌, ఏటీబీ ప్రాజెక్ట్‌ లీడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ జాకెట్‌ (బ్రా) రూపకల్పన మహిళలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా..పూర్తి స్థాయిలో కంఫర్ట్ గా ఉండేలా ఉపయోగపడుతుందని..వారి పనితీరు స్థాయిలు మెరుగుపడటానికి చక్కటి సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. దీంతో మహిళా జవాన్లు వారి మిషన్‌పై దృష్టి పెట్టగలుగుతారు’ అని వివరించారు.

ప్రస్తుతం నాలుగు రకాల బ్రా తయారీలను ఆర్మీ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. త్వరలోనే వీటిలో ఒక మోడల్ ను సెలక్ట్ చేసి ఖరారు చేయనున్నారు. లో దుస్తువుల తయారీలో భాగంగా మహిళా జవాన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. జవాన్ల లోదుస్తువులను ఆర్మీ అధికారులు రూపొందిస్తుండడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనించాల్సిన విషయం.

కాగా..గత కొన్ని సంవత్సరాలుగా మహిళా జవాన్లు వారు ధరించే బ్రాల విషయంలో తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో వారి నుంచి కొన్నాళ్లు వస్తున్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తర్వాత యూఎస్‌ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా మహిళల ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తూ యూఎస్‌ ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించటమే కాదు..వారి కోసం సౌకర్యవంతమైన లో దుస్తులు రూపొందించాలనే నిర్ణయం తీసుకున్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.