US Soldiers AR Goggles : సూపర్ సోల్జర్స్.. అమెరికా ఆర్మీ కోసం మైక్రోసాఫ్ట్‌ ఏఆర్ కళ్లజోళ్లు..

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ కాంట్రాక్టు దక్కించుకుంది. అమెరికా ఆర్మీ కోసం 22 బిలియన్ డాలర్ల అత్యాధునిక టెక్నాలజీతో రియాల్టీ హెడ్ సేట్స్ ఏఆర్ కళ్లజోళ్లను అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

US Soldiers AR Goggles : సూపర్ సోల్జర్స్.. అమెరికా ఆర్మీ కోసం మైక్రోసాఫ్ట్‌ ఏఆర్ కళ్లజోళ్లు..

Us Army To Have 'super Soldiers' With Ar Goggles Made By Microsoft

Super Soldiers With AR Goggles : అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ కాంట్రాక్టు దక్కించుకుంది. అమెరికా ఆర్మీ కోసం 22 బిలియన్ డాలర్ల అత్యాధునిక టెక్నాలజీతో రియాల్టీ హెడ్ సేట్స్ ఏఆర్ కళ్లజోళ్లను అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. కస్టమ్ మేడ్ రియాల్టీ హెడ్ సెట్స్‌ను అమెరికా ఆర్మీ సైనికుల కోసం అందించనుంది. 10ఏళ్ల వ్యవధిలో 1లక్ష 20వేలకు పైగా యూనిట్ల కస్టమ్ గేర్ అందించే దిశగా మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తోంది. కొన్నేళ్ల క్రితమే ఇంటిగ్రేటెడ్ వ్యూజువల్ అగ్యుమెంటెడ్ సిస్టమ్ (IVAS) ప్రోగ్రామ్ కోసం ప్రొటోటైప్స్ రూపొందించేందుకు ఈ సాఫ్ట్ వేర్ మేకర్ 479 మిలియన్ డాలర్లు తీసుకుంది.

25

ఆర్మీ బలగాల కోసం అతిసమీపంలో ఒకే డివైజ్‌కు కనెక్ట్ అయ్యే కీలక టెక్నాలజీ వ్యవస్థను ఇంటిగ్రేట్ చేయడమే లక్ష్యంగా కొనసాగింది. ఇప్పుడీ ఈ ప్రొగ్రామ్. ప్రోటోటైపింగ్ నుంచి ప్రొడక్షన్ దిశగా కొనసాగుతున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. IVAS హెడ్ సెట్స్ ఏంటంటే? మైక్రోసాఫ్ట్ HoloLens ఆధారంగా ఈ హెడ్ సెట్ రూపొందిస్తోంది. 2016లోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఒక్కో హెడ్ సెట్ వాణిజ్య విలువ 3,500 డాలర్లు ఉంటుంది. ఈ హెడ్ సెట్ ద్వారా హోలోగ్రామ్స్ చూడొచ్చు. చేతులు, శబ్దంతో సైగల ద్వారా కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుంటుంది. అగ్యుమెంటెడ్ రియాల్టీ (AR) టెక్నాలజీ అనేది వర్చువల్ రియాల్టీ (VR)కు భిన్నంగా ఉంటుంది.

ఈ IVAS హెడ్ సెట్.. ఒకే రకమైన HoloLens ఆధారంగా మైక్రోసాఫ్ట్ Azure క్లౌడ్ సర్వీసు ద్వారా డెలివరీ చేస్తుంది. తద్వారా సైనికులు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. పరిస్థితులపై సైనికులకు అవగాహన కల్పించడే కాకుండా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునేలా సమాచారాన్ని అందిస్తుంది. ఈ హెడ్ సెట్స్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి.

Army
క్లోజ్ కంబాట్ ఫోర్స్ (CCF) మిక్స్ డ్ రియాల్టీ ట్రైనింగ్ ఇన్విరానమెంట్ ఉండేలా చేస్తుందని అమెరికా ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ హెడ్ సెట్ సూట్.. హైరెజుల్యుషన్ నైట్, థెర్మల్ సామర్థ్యం కలిగి ఉంది. యూనిఫైడ్ హెడ్స్ అప్ లో సోల్జర్ బోర్న్ సెన్సార్లు ఇంటిగ్రేట్ అయ్యాయి. దీనిద్వారా ప్రస్తుత, భవిష్యత్తులో ఆర్మీ నిర్దేశిత లక్ష్యాలను సాధించడం, పరిస్థితులపై అవగాహనను మెరుగుపరుస్తుంది.