బుర్రా..బుద్ధీ ఉన్నాయా నీకు? పిల్లాడితో సహా కారు ఎత్తుకుపోయి..తల్లికి క్లాస్ పీకి..వార్నింగ్ ఇచ్చిన దొంగ

బుర్రా..బుద్ధీ ఉన్నాయా నీకు? పిల్లాడితో సహా కారు ఎత్తుకుపోయి..తల్లికి క్లాస్ పీకి..వార్నింగ్ ఇచ్చిన దొంగ

US : car Thief warning to mother who left boy in car :  ఓ కారును ఎత్తుకుపోయిన దొంగ కాస్త దూరం వెళ్లాక షాక్ అయ్యాడు. వెనక సీట్లో నాలుగేళ్ల పిల్లాడిని చూసి షాక్ అయ్యాడు. కారు భలే దొరికిందనుకుంటే ఈ బుడ్డోడేంటీ ఇక్కడున్నాడు? అనుకున్నాడు. పాపం ఆ పిల్లాడు కారులో తెలియని వ్యక్తి కనిపించటంతో కంగారు పడి ఏడుపు లంఘించుకున్నాడు. దీంతో ఆ దొంగ తిరిగి తాను కారు దొంగలించిన చోటికి వచ్చాడు. అక్కడు ఓ తల్లి పిల్లాడితో సహా కారుకనిపించకుండాపోవటం కంగారుపడిపోతూ కనిపించింది. అంతే ఆ దొంగకు చిర్రెత్తుకొచ్చింది. అంతే ఆ తల్లిమీద విరుచుకుపడిపోయాడు. ఫుల్ గా క్లాస్ పీకాడు..ఇంకోసారి ఇలా చేశావంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

అది యూఎస్..వాషింగ్ స్టన్ లోని బీవెర్టన్ నగరంలోని పోర్ట్‌ల్యాండ్ సబర్బ్‌లోని ఓ నిత్యావసర వస్తువులు దొరికే షాప్. ఆ షాప్ లో నిత్యవసర వస్తువులతో పాటు అన్ని రకాల మాంసం లభిస్తుంది. అక్కడకు ఓ కారు వచ్చి ఆగింది. కారులోంచి ఓ మహిళ దిగింగడి. కారుని ని కారును రన్నింగ్‌లో ఉంచి షాపులోకి వెళ్లింది. పాలు, మంసం కొనుకుంది.

ఇదంతా ఓ దొంగ గమనిస్తున్నాడు. అక్కడకు కారు వచ్చి ఆగటం..ఓకామె షాపులోకి వెళ్లటం చూశాడు. గబగబా కారుదగ్గరకొచ్చాడు. కారులో ఏమైనా వస్తువులు ఉంటాయోమో కొట్టేద్దామని వెళ్లాడు. కానీ కారుకు తాళాలు అలాగే ఉండటం..చూశాడు. అంతే కారులో చొరబడి కారును ఎత్తుకుపోయాడు. అలా కొంతదూరం వెళ్లాక వెనక సీట్లో ఉన్న నాలుగేళ్ల పిల్లాడిని చూసి షాక్ అయ్యాడు.

దీంతో ఆ దొంగ ఆ పిల్లాడికి చూసి జాలిపడ్డాడు. పిల్లాడి కోసం ఆ తల్లి కంగారుపడుతుందేమోననుకున్నాడు. అంతే కారును వెనక్కి తిప్పీ..మళ్లీ ఎక్కడినుంచైతే పట్టుకెళ్లిపోయాడో ఆ షాపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బిడ్డ కోసం కంగారు పడుతున్న తల్లిని చూసాడు. ఆమెను చూడాగానే ఆ దొంగకు చిర్రెత్తుకొచ్చింది. విసురుగా కారు దిగి.. ‘‘నీకసలు బుర్రా బుద్ధీ ఉన్నాయా? అవే ఉంటే పిల్లాడిని ఇలాకారులో వదిలేసిపోతావా? అలా చేస్తే ప్రమాదమని నీకు తెలీదా? పసి పిల్లాడిని కారులో వదిలి షాపులోకి వెళ్తావా? అలా పిల్లలను కారులో ఉంచడం ప్రమాదకరమనే విషయం నీకు తెలీదా? డోర్స్ లాక్ అయిపోతే పరిస్థితి ఏంటని కనీసం ఆలోచించావా? నువ్వు చేసింది ఎంత తప్పో నీకు తెలుసా? ఈ విషయం పోలీసులకు చెబుతా’’ అంటూ ఫుల్ గా క్లాస్ పీకాడు.

దొంగ పీకే క్లాస్ ను బిత్తరపోయి వింటున్న ఆ తల్లికి తాను చేసింది ఎంత ప్రమాదమో అర్థం అయ్యేసరికి ఆ దొంగ కాస్తా ఆ పిల్లాడికి కారులోంచి దింపి తల్లికి అప్పగించి మళ్లీ కారుతో సహా ఉడాయించాడు. దీంతో ఆమె తేరుకుని ‘‘ఈ దొంగ భలే చిత్రంగా ఉన్నాడే..మంచోడా చెడ్డోడా? అని ఆలోచిస్తుండిపోయింది.

ఈ విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. ఈ ఘటనపై బీవెర్టన్ పోలీస్ అధికార ప్రతినిధి మ్యాట్ హెండెర్సన్ మాట్లాడుతూ..కారును ఎత్తుకుపోయిన ఆ దొంగ పసివాడిని తిరిగి తల్లికి అప్పగించి మంచి పని చేశాడని..ఆ దొంగ నీతి కలవాడేనంటూ వెల్లడించారు. దొంగల్లో మంచి దొంగలు కూడా ఉంటారని ఈ భలే దొంగ నిరూపించాడని పోలీసు అధికారే అనటం గమనించాల్సిన విషయం. కాగా దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కారును కనుగొన్నారు. కానీ అప్పటికే ఆ దొంగ ఆకారును ఓ చోట వదిలిపోయినట్లుగా తెలుస్తోంది.మరి పోలీసులు ఆ దొంగను పట్టుకుంటారా? లేదా చేసే పనిలో మంచి కూడా చేశాడని వదిలేస్తారో మరి..!!