US : అప్గానిస్తాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా దాడులు

తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అప్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా ఆకాశం నుంచి దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

US : అప్గానిస్తాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా దాడులు

Us Carried Out Airstrikes Afghanistan

Afghanistan : తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అప్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా ఆకాశం నుంచి దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..అమెరికా ఈ తరహా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రభుత్వ బలగాల నుంచి ఎత్తుకపోయిన సామాగ్రీని విడుదల చేసేందుకు..శత్రువుల బలగాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే..దాడుల వివరాలను మాత్రం వెల్లడించాడానికి నో చెప్పింది. సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ ఫ్రాంక్ మెకంజీ ఆదేశాల మేరకే ఇవి జరిగాయని, అప్గాన్ బలగాలకు మద్దతుగా ఇలాంటి మున్ముందు కూడా దాడులు కొనసాగుతాయని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. మొత్తం 20 రోజుల్లో సుమారు 7 డ్రోన్ దాడులు జరిగినట్లు CNN వెల్లడించింది.