US-China War : అగ్రరాజ్యంతో యుద్ధం వస్తే.. చైనానే సూపర్ పవర్..!

అమెరికా, చైనా మధ్య యుద్ధం వస్తే ఏ దేశం నెగ్గుతుంది? అంటే... చైనానే అంటోంది గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధం వస్తే అమెరికా ఓటమి చెందడం ఖాయమంటూ సంపాదకీయం రాసింది.

US-China War : అగ్రరాజ్యంతో యుద్ధం వస్తే.. చైనానే సూపర్ పవర్..!

Us China War Southern China Will Defeat Us To Become Super Power

US-China War : అమెరికా, చైనా మధ్య యుద్ధం వస్తే ఏ దేశం నెగ్గుతుంది? అంటే… చైనానే అంటోంది గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా. దక్షిణ చైనా సముద్రంపై యుద్ధం వస్తే అమెరికా ఓటమి చెందడం ఖాయమంటూ సంపాదకీయం రాసింది. అగ్రదేశాన్ని బహిరంగంగా సవాల్‌ చేసేందుకు ఏమాత్రం వెనుకాడని చైనాను సూపర్‌ పవర్‌గా అభివర్ణించింది.

అయితే గ్లోబల్‌ టైమ్స్‌ చైనా పాలక కమ్యునిస్ట్‌ పార్టీకి అధికారిక వార్తా పత్రిక కావడంతో దీనిని.. చైనా ప్రభుత్వ ప్రకటనగా భావిస్తోంది అంతర్జాతీయ సమాజం. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్‌ సైనిక విన్యాసాల్లో అమెరికా ప్రమేయాన్ని ప్రస్తావించిన గ్లోబల్‌ టైమ్స్‌.. దక్షిణ జపాన్‌లో సైనిక విన్యాసం చైనాను ఏమాత్రం ప్రభావితం చేయలేదని పేర్కొంది.

దక్షిణ చైనా సముద్రంపై.. బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, తైవాన్‌ దేశాల వాదనను ఖండించింది. అయితే ఈ కథనాన్ని అమెరికన్‌ నిపుణుడు అలెక్స్‌ మిహైలోవిచ్‌ కొట్టిపారేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో అమెరికాకు పెరుగుతున్న మద్దతు, సైనిక విన్యాసాలతో చైనా మరుగుజ్జుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అందుకే యుద్ధం ప్రస్తావన తెచ్చిందన్నారు.

మరోవైపు బ్రిటీష్‌ వెబ్‌సైట్‌ ఒకటి.. చైనా పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ ప్లాన్‌పై ఓ కథనం ఇచ్చింది. ఈ వారం ఆరంభంలో.. మెరైన్‌ కమాండోలకు శిక్షణ ఇస్తూ ఒక ద్వీపంపై దాడి చేయడంతో తైవాన్‌ను బెదిరించడానికి చైనా యత్నిస్తోందంటూ ప్రస్తావించింది. దక్షిణ చైనా సముద్రం సంపద తమదేనని ఓ వైపు చైనా వాదిస్తుంటే… చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మిగతా దేశాలకు మరోవైపు అమెరికా మద్దతివ్వడంతో.. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.