Monkeypox: అమెరికాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

నార్త్ అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన హెల్త్ అథారిటీలు మే నెలారంభంలో పలు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆఫ్రికాలో దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా కెనడాలో డజనుకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

Monkeypox: నార్త్ అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన హెల్త్ అథారిటీలు మే నెలారంభంలో పలు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆఫ్రికాలో దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా కెనడాలో డజనుకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో 40కంటే ఎక్కువగా నమోదైన కేసుల తర్వాత కెనడాలో కేసుల తీవ్రత కనిపిస్తుంది.

మే6 నుంచి బ్రిటన్ లో 9కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ లో బుధవారం తొలిసారి మొదటి మంకీపాక్స్ కేసు నమోదైంది. రీసెంట్ గా కెనడాకు వెళ్లొచ్చిన తర్వాతే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. కొద్దివారాలుగా ఈ జబ్బు నుంచి కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా అరుదుగా ప్రాణాంతకంగా మారుతుందట.

Read Also : యూకేలో మంకీ పాక్స్ వైరస్ కలకలం..

“స్థానిక దేశాలలో మంకీపాక్స్ పరిధిని మనం బాగా అర్థం చేసుకోవాలి. నిజంగా ఎంత చెలామణి అవుతోంది. అక్కడ నివసించే ప్రజలకు దాని వల్ల కలిగే ప్రమాదం, అలాగే వ్యాప్తి జరిగే ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలి” అని అంటువ్యాధి ఎపిడెమియాలజిస్ట్ డా. మరియా వాన్ కెర్ఖోవ్ మంగళవారం ప్రపంచ ఆరోగ్య సమస్యలపై WHO విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు