అమెరికా వరల్డ్ రికార్డ్ : 24గంటల్లో 1480 కరోనా మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 05:27 AM IST
అమెరికా వరల్డ్ రికార్డ్ : 24గంటల్లో 1480 కరోనా మరణాలు

కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారిపోయింది. కరోనా(COVID-19)మరణాలు,కేసుల నమోదులో అగ్రరాజ్యం వైరస్ మొదట వెలుగులో్కి వచ్చిన చైనాను దాటిపోయింది. ప్రపంచంలో అన్నింటా తామే ముందు ఉండాలనుకున్నాడో ఏమో ట్రంప్. కరోనా కేసులు పెరుగుతున్న,మరణాలు కూడా అంతేస్థాయిలో భారీగా నమోదవుతున్నా ఆయన కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నట్లు సృష్టంగా అర్థమవుతుంది. చెప్పేది వింటే ఆయన ట్రంప్ ఎలా అవుతాడు మరి. ట్రంప్ నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలమంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు…ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా 24గంటల్లోనే దాదాపు 1500మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలోనే కరోనా మరణాలు 24గంట్లలో అత్యధికంగా అమెరికాలోనే నమోదయ్యాయి. గురువారం(ఏప్రిల్-2,2020)రాత్రి 8గంటల నుంచి శుక్రవారం(ఏప్రిల్-3,2020)రాత్రి 8గంటలవరకు అమెరికాలో 1,408కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలోనే 24గంటల్లోనే కరోనా మరణాల రికార్డు అమెరికాలోనే నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటివరకు అమెరికాలో 7,406మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షల 77వేల 475 కరోనా కేసులు నమోదయ్యాయి.

ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం అమెరికన్లలో ఆందోళన కలిగిస్తొంది. అమెరికా కరోనాతో పూర్తిస్థాయిలో పోరాడుతోందని… అయితే మహమ్మారి ధాటికి 2,40,000 అమెరికన్లు మృత్యువాత పడే అవకాశం ఉందని వైట్ హౌస్ హెచ్చరించింది. అయితే దాదాపు 1లక్షమంది వరకు కరోనా మరణాలు నమోదయ్యే అవకాశముందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ మరో కొత్త విషమేమిటంటే, అల్ ఖైదా ఉగ్రసంస్థ అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిపిన ఉగ్రదాడుల్లో మరణించిన వారిసంఖ్య కంటే ఈ కరోనా మహమ్మారి కారణంగా మరణించిన అమెరికన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ,పెంటగాన్ పై జరిగిన 9/11 ఉగ్రదాడిలో 2977మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. 25వేలమంది గాయపడ్డారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 7వేలమందికిపైగా అమెరికన్లు మరణించారు. అమెరికా గడ్డపై జరిగిన ఉగ్రదాడుల్లో అకస్మాత్తుగా మరణించిన వారి కన్నా కరోనా వైరస్ కారణంగానే ఎక్కువమంది చనిపోయారు.

కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఊహించని కరోనా కారణంగా అమెరికాలో రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందన్న విశ్లేషణలతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. ఓ అంచనా ప్రకారం….దాదాపు 4.7కోట్ల మంది నిరుద్యోగులుగా మారనున్నారు. అయితే ఇప్పటికే అమెరికాలో లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అమెరికా దీన్ని బయటపడేందుకు ఇంకా చాలారోజులు పట్టేట్లు కనిపిస్తోంది.

Also Read | మార్నింగ్ వాక్ చేసిన 41 మంది అరెస్ట్