H-1B Visa : ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్.. ట్రంప్ తీసుకొచ్చిన వీసా రూల్స్ కొట్టివేత

ఇది భారత టెకీలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మార్చిన హెచ్1బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కు

H-1B Visa : ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్.. ట్రంప్ తీసుకొచ్చిన వీసా రూల్స్ కొట్టివేత

H 1b Visa

H-1B Visa : ఇది భారత టెకీలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మార్చిన హెచ్1బీ వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులను తీసుకోకుండా ట్రంప్ గతేడాది కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. లాటరీ పద్ధతిలో ఎక్కువ వేతనాలుండే ఉద్యోగాలకు అమెరికన్లను తీసుకునేలా రూల్స్ మార్చారు.

అయితే, ఈ నిబంధన వల్ల ప్రతిభ కలిగిన విదేశీయులు, విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగా మారుతుందని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇమిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్ కు విరుద్ధమని చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పిటిషనర్లు వాదించారు.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

గతేడాది డిసెంబర్ లో అమెరికా జిల్లా కోర్టు ఆ నిబంధనలను తాత్కాలికంగా నిలిపేసింది. తాజాగా అసలు ఆ నిబంధనలు చెల్లబోవంటూ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ఆ నిబంధనలను ఇచ్చినప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ చార్జి మంత్రిని అక్రమంగా నియమించారని, కాబట్టి ఆ రూల్స్ చెల్లవని తేల్చి చెప్పింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్థానికులకు ప్రయోజనం కల్పించేలా వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. అమెరికాలో ఉద్యోగాల కోసం స్థానికులు విదేశీయులతో పోటీ పడటం తగ్గుతుందని అప్పట్లో ప్రకటించారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

H-1B వీసాతో అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని వారి కంపెనీల్లో నియమించుకోవడానికి అనుమతిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది యుఎస్ టెక్ కంపెనీలు పెద్దఎత్తున భారత్, చైనాలకు చెందిన ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఏటా జారీ అయ్యే 85వేల హెచ్1 బీ వీసాల్లో చైనా, భారతీయ పౌరులే దాదాపు 50వేల వీసాలు పొందుతుంటారు. ఒకవేళ ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనలు అమలు చేస్తే ఇరు దేశాల టెకీలపై తీవ్ర ప్రభావం పడతుంది. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్-1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తోంది. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటాయి. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లిన వేలాది మంది టెకీలు హెచ్-1బీ వీసాలతోనే ఉద్యోగం చేస్తున్నారు.

హెచ్-1బీ వీసాలకు తొలుత దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వీటిని లాటరీ ద్వారా జారీ చేస్తారు. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలకాలని భావించారు. హెచ్‌-1బీ వీసాలు పొందిన వారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది.