పదేళ్ల నాటి కేసులో ఆపిల్‌కు 3వేల 7వందల కోట్లు జరిమానా!

  • Published By: vamsi ,Published On : November 1, 2020 / 07:21 AM IST
పదేళ్ల నాటి కేసులో ఆపిల్‌కు 3వేల 7వందల కోట్లు జరిమానా!

Penalty to Apple: సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థ VirnetXకు చెందిన పేటెంట్ పొందిన వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) టెక్నాలజీని వాడుకున్నందుకు యుఎస్ జ్యూరీ ఆపిల్‌కు 503 మిలియన్ డాలర్లు(37,49,75,43,400రూపాయలు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అమెరికన్ కోర్టు.

ఐఫోన్, ఐప్యాడ్ మరియు ఐపాడ్ టచ్‌లోని ఆపిల్ పరికరాల్లో డేటా ట్రాన్స్మిషన్ భద్రతను ఈ చట్టపరమైన కేసు కలిగి ఉంది.

ఆపిల్ తన ఉత్పత్తుల కోసం పేటెంట్ పొందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు నెవాడాకు చెందిన VirnetX ఆరోపించింది . ఆపిల్ VirnetX వేసిన పేటెంట్‌ను సవాలు చేసింది. ఇలాంటి కేసులు ఆవిష్కరణలకు అడ్డు కట్ట వెయ్యడానికి మరియు వినియోగదారులకు హానీ కలిగించేలా చెయ్యడానికి మాత్రమే ఉపయోగపడతాయని కోర్టుకు ఆపిల్ తెలిపింది.

ఇది పదేళ్ల క్రితం నమోదైన కేసు కాగా.. VPN ఆన్ డిమాండ్ మరియు ఆపిల్ ఫేస్ టైమ్ తన పేటెంట్‌ను ఉపయోగిస్తున్నాయని VirnetX సంస్థ అప్పటి నుంచి కోర్టులో పోరాతున్నాయి. 700 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తూ VirnetX కోర్టుకు ఎక్కింది. ఈ క్రమంలోనే కంపెనీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

దీనిపై ఆపిల్ ప్రతినిధి మాట్లాడుతూ.. “జ్యూరీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. కానీ తీర్పుతో నిరాశ చెందాము. అప్పీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము” అని అన్నారు.

తమ ఉత్పత్తుల ప్రధాన పనితీరులో VirnetX టెక్నాలజీకి సంబంధించిన ఉఫయోగం ఏమీ లేదని, కేసుల వల్ల సాంకేతిక రంగానికి, వినయోగదారులకు నష్టం చేకూరుతుందని ఆపిల్ అభిప్రాయపడుతుంది.