US Delta Variant : అమెరికాలో డెల్టా ఉదృతి..సగానికి పైగా వేరియంట్ కేసులే

అమెరికాలో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. గతంలో కరోనా కంటే కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ అమెరికాపై ఆధిపత్యాన్ని చూపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 52శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(CDC) వెల్లడించింది.

US Delta Variant : అమెరికాలో డెల్టా ఉదృతి..సగానికి పైగా వేరియంట్ కేసులే

Us Covid Delta Variant (1)

US Covid Delta Variant cases Rising : అమెరికాలో కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. యూఎస్ లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపించటంలేదు. ఈ క్రమంలో కరోనా ప్రతాపాన్ని మరోసారి చూపిస్తుంది. గతంలో కరోనా కంటే కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ అమెరికాపై డెల్టా వేరియంట్ ఆధిపత్యాన్ని చూపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసుల్లో 51.7 శాతానికి పైగా అంటే దాదాదపు 52 శాతం కేసులు ఈ వేరియంట్‌వేనని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(CDC) వెల్లడించింది. కరోనా వేరియంట్లలో డెల్టా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ డెల్టా వేరింట్ వ్యాపించింది.

దీంట్లో బాగంగానే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు చాలా తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 80 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమవుతోంది. ఒకప్పుడు దేశంలో ఎక్కువగా కనిపించిన ఆల్ఫా వేరియంట్‌ ప్రస్తుతం 28.7 శాతం కేసులకు కారణమవుతోందని సీడీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టీకా ఎందుకు అని ఎవరైనా అడిగితే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి పెరగడమే కారణమని చెప్పవచ్చని అమెరికా ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఫౌచీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈవేరియంట్‌ ఆధిపత్యం మరింతగా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతున్న కేసులు కనిపిస్తున్నాయని, కానీ వీటి సంఖ్య తక్కువేనని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందీ అంటే..జులై 6నాటికి 13,859 కేసులు నమోదు అయ్యాయి. ఇవి రెండువారాల ముందుతో పోలిస్తే 21 శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది. జులై వీకెండ్ కావటంతో జనాలు పలు ప్రాంతాలకు వెళ్లటానికి బయటకువస్తుంటారు. దీంతో కేసులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. గత రెండు వారాల కంటే 52 శాతం కేసులు పెరిగాయని సీడీసీ తెలిపింది. అమెరికా స్వాతంత్ర్య దినం నాటికి (జులై 4)యూఎస్ వ్యాప్తంగా 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధ్యక్షుడు బైడెట్ టార్గెట్ గా పెట్టుకున్నా..అది సాధ్యం కాలేదు. 67 శాతం వ్యాక్సిన్ వేసినట్లుగా తెలుస్తోంది.

వ్యాక్సినేషన్ తోనే కట్టడి సాధ్యం..
డెల్టా వేరియంట్‌ కారణంగా కేసులు పెరగడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని తట్టుకోవాలంటే ఎక్కువమందికి టీకా ఇవ్వడమే మార్గమని నిపుణులు చెబుతున్నారు.వేరియంట్‌ రూపుమార్చుకొని మరింత వేగంగా వ్యాపించే సామర్ధ్యం పెంచుకుంటున్నప్పుడు, దాన్ని అడ్డుకునేందుకు సమాజంలో టీకా తీసుకున్న వారి సంఖ్యను పెంచుకుంటూ పోవడమే మార్గమని డాక్టర్‌ డేవిడ్‌ పెర్సీ వెల్లడించారు.ఇప్పటివరకు టీకా తీసుకోని వారు డెల్టా బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ ఇచ్చేలా ప్రస్తుత వ్యాక్సిన్లున్నాయని..కానీ ఇప్పటికీ అధిక శాతం మంది ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని..దీని వల్ల ప్రమాదం మరింతగా పెరుగుతోందని నిపుణఉలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పైక్‌ ప్రోటీన్‌లో ఉత్పరివర్తనంతో డెల్టా వేరియంట్‌ ఆవిర్భవించింది. ఇది గత వేరియంట్ల కన్నా ఎక్కువ ప్రభావవంతంగా ఆరోగ్యంగా ఉన్న మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే శక్తిని పొంపొందించుకుంటూ వ్యాప్తి కూడా అదే స్థాయిలో ఉంటోంది. దీన్ని కట్టడి చేయాలంటే ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్కమార్గం వ్యాక్సిన్ వేయించుకోవటమే ననీ..అందరూ వ్యాక్సిన్ వేయిచుకోవాలని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు.